Raasi : ఆంటీ అంటే ఎందుకు ఫీల్ అవ్వడం.. ఎందుకు ఏజ్ దాస్తారు.. వాళ్లకు రాశి కౌంటర్..?

ఆంటీ అనే పదం గురించి, అమ్మాయిల ఏజ్ దాచడం గురించి రాశి బోల్డ్ గా మాట్లాడింది.(Raasi)

Raasi : ఆంటీ అంటే ఎందుకు ఫీల్ అవ్వడం.. ఎందుకు ఏజ్ దాస్తారు.. వాళ్లకు రాశి కౌంటర్..?

Raasi

Updated On : September 22, 2025 / 1:33 PM IST

Raasi : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి మధ్యలో పెళ్లి, పాపతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి తన గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో ఆంటీ అనే పదం గురించి, అమ్మాయిల ఏజ్ దాచడం గురించి బోల్డ్ గా మాట్లాడింది.(Raasi)

రాశి మాట్లాడుతూ..ఆంటీ అంటే ఎందుకు ఫీల్ అవ్వడం. అమ్మాయిలు ఏజ్ దాచాలని చూస్తారు. చాలా మంది 35 దగ్గర ఆపేసుకొని ఉంటారు. కొంతమంది పెళ్లయినవాళ్లు కూడా అడిగితే 35 ప్లస్ అని చెప్తారు. ఆ ప్లస్ లో చాలా ఉంటాయి. ఎందుకు దాచడం నీ ఏజ్. కొంతమందికి ఆంటీ అంటే ఇష్టం ఉండదు. నేను ఆంటీనా అంటారు. ఆంటీనే మరి. నన్ను అందరూ అమ్మ అంటారు. రాశి అమ్మ అంటారు. చాలా తక్కువ మంది మేడం అంటారు. నాతో చిన్న పిల్లలు యాక్ట్ చేయడానికి వస్తే మేడం అంటారు. నేను మేడం అని ఎందుకు ఆంటీ అని పిలువమ్మా అంటాను. మేడం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఆంటీ అంటే ఒక బంధం కలుపుకున్నట్టు ఉంటుంది. దగ్గరగా అనిపిస్తుంది అని తెలిపింది.

Also Read : Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను.. ఎందుకంటే.. రాశి కామెంట్స్..

దీంతో రాశి కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇటీవల అనసూయతో పాటు కొంతమంది నటీమణులు ఆంటీ అనే పదాన్ని ఏదో తప్పుగా చూస్తూ మాట్లాడారు. ఆంటీ అని పిలవకూడదు అని డైలాగ్స్ వేశారు. అలా ఎలా అంటారు అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఓ సమయంలో ఈ ఆంటీ అని పిలవడం పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది నటీమణులు కూడా వాళ్ళ ఏజ్ దాచడానికి కష్టపడుతుంటారు. వాళ్లందరికీ ఇప్పుడు రాశి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిందని, ఉన్న నిజాన్ని చెప్పుకుంటే తప్పేంటని నెటిజన్లు అంటున్నారు.