Radhe Shyam: ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసిన రాధేశ్యామ్.. ఫలితం ఎలా ఉంటుందో?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

Radheshyam
Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు.
Radhe Shyam: నష్టాలపాలైన బయ్యర్లు.. రాధేశ్యామ్ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!
కానీ ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన మ్యాజిక్‌ను చూపించలేకపోయింది. కలెక్షన్ల పరంగా కూడా బయ్యర్లు భారీ నష్టాలను చూడాల్సి వచ్చిందని కథనాలు వినిపిస్తూ వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. గురువారం అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీనికి బట్టి చూస్తే విడుదలైన మూడు వారాలకే ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేశారు మేకర్స్.
Radhe Shyam: గ్లోబల్ స్టార్ ప్రభాస్.. ఇకనైనా కాస్త ఆలోచించవయ్యా!
ఈ సినిమాకు సంబంధించిన అన్ని వెర్షన్లను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయగా లవ్ స్టోరీగా చాలా కాలం తర్వాత ప్రభాస్ ను లవర్ బాయ్ గా చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారని.. ఫలితంగా ఓటీటీలో రాధేశ్యామ్ కు మంచి ఆదరణ దక్కనుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. గతంలో పలు సినిమాలు ఇలా సిల్వర్ స్క్రీన్ మీద బోల్తా కొట్టినా.. స్మాల్ స్క్రీన్ మీద రాణించాయి. మరి రాధేశ్యామ్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.