Radhe Shyam: గ్లోబల్ స్టార్ ప్రభాస్.. ఇకనైనా కాస్త ఆలోచించవయ్యా!

పాన్ ఇండియా క్రేజ్.. ప్రభాస్ ఫేమ్.. భారీ బడ్జెట్.. హై రేంజ్ హైప్.. ఏదీ.. ఏదీ రాధేశ్యామ్ ను నిలబెట్టలేకపోయాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు రాబడిని రాబట్టలేకపోయాయి. ఇది చూసాకైన..

Radhe Shyam: గ్లోబల్ స్టార్ ప్రభాస్.. ఇకనైనా కాస్త ఆలోచించవయ్యా!

Prabhas

Radhe Shyam: పాన్ ఇండియా క్రేజ్.. ప్రభాస్ ఫేమ్.. భారీ బడ్జెట్.. హై రేంజ్ హైప్.. ఏదీ.. ఏదీ రాధేశ్యామ్ ను నిలబెట్టలేకపోయాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు రాబడిని రాబట్టలేకపోయాయి. ఇది చూసాకైన జాగ్రత్తపడకపోతే.. రియలైజేషన్ అవకపోతే ముందు ముందు గ్లోబల్ స్టార్ కి మరిన్ని తిప్పలు తప్పవు. రిచ్ లెవెల్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అని కాకుండా ప్రభాస్ ఆచితూచి అడుగేయాల్సిన టైమ్ వచ్చేసింది.

Radhe Shyam: ఓటీటీలో రాధేశ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రభాస్ జాగ్రత్తపడాలి. స్క్రిప్ట్ ల విషయంలో లార్జ్ స్కేల్ లో ఆలోచించాల్సిన సమయం వచ్చిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత నార్త్ లో స్టార్ డం తెచ్చుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు రాధేశ్యామ్ తో గట్టి షాక్ ఇచ్చారు అక్కడి ప్రేక్షకులు. లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే కాదు కావాల్సింది.. మిక్స్ డ్ వేరియేషన్స్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అని చెప్పకనే చెప్పారు. బాలీవుడ్ లో ఫస్ట్ వీక్ బాహుబలి2తో 247కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన డార్లింగ్.. సాహోకు 116, బాహుబలి1తో దాదాపు 48కోట్లు సాధించాడు. కానీ రాధేశ్యామ్ 19కోట్ల దగ్గరే ఆగిపోయింది.

Radhe Shyam: భీమ్లా నాయక్‌ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!

ఒక్క నార్త్ లోనే కాదు.. మొత్తంగా సౌత్ లోనూ ఇదే పరిస్థితి. ప్రభాస్ రేంజ్ కు తగ్గ కలెక్షన్స్ ఎక్కడ రాబట్టలేకపోతున్నారు. ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా బాక్సాఫీస్ వెలవెలబోతోంది. హీరో కటౌట్ కి దగ్గ కలెక్షన్స్ రాధేశ్యామ్ సంపాదించలేకపోతుంది. ది కశ్మీర్ ఫైల్స్ వంటి అనుకోని హిట్స్ తో ఇటు రాధేశ్యామ్ థియేటర్స కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఇక ట్రిపుల్ ఆర్ రంగంలోకి దిగితే రాధేశ్యామ్ ను పట్టించుకునే వాళ్లుండరు. ఫస్ట్ వీక్ 80శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ… లాంగ్ రన్ చేయలేకపోతుంది.

Radhe Shyam: రాధేశ్యామ్‌ను వాళ్లు గట్టెక్కిస్తారా?

రాధేశ్యామ్ ఎందుకు అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిందనే విషయాన్ని ప్రభాస్ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. తనకున్న స్టార్ డంతో ఎలాంటి సినిమాలు చేసి.. ఇంపాక్ట్ పెంచుకోవచ్చో థింక్ చేయాలి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సలార్, ఆదిపురుశ్, ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగా సినిమాలపైనే ఫ్యాన్స్ ఆశలన్నీ. చూస్తుంటే ఈ సినిమాల్లో ఎలిమెంట్స్ కూడా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ థింకింగ్ ఓకే.. చుట్టూఉన్న గుంపే ముంచుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. సరైన ప్రమోషన్స్ చేయలేకపోయిన యూవీ క్రియేషన్స్ కూడా రాధేశ్యామ్ రిజల్ట్ కు బాధ్యత వహించాలనే ట్రోలింగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.