Radhika : చిరంజీవిని చెంప మీద 23 సార్లు కొట్టాను.. ఎర్రగా వాచిపోయింది..

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి రాధిక మాట్లాడుతూ.. ''మేం ఇద్దరం కలిసి చేసిన 'న్యాయం కావాలి' సినిమా నా లైఫ్‌ లో టర్నింగ్‌ పాయింట్‌ సినిమా. అందులో చిరంజీవిని కొట్టికొట్టి మాట్లాడే....

Radhika : చిరంజీవిని చెంప మీద 23 సార్లు కొట్టాను.. ఎర్రగా వాచిపోయింది..

Radhika

 

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్స్ గా అనేక సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి కాంబినేషన్స్ లో చాలా సినిమాలు వచ్చి విజయం సాధించాయి. ప్రస్తుతం రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అక్క పాత్రలు చేస్తుంది. ఇటీవలే ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది రాధిక. తాజాగా రాధిక ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం ప్రోమో తాజాగా రిలీజ్ చేయగా ఇందులో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి రాధిక మాట్లాడుతూ.. ”మేం ఇద్దరం కలిసి చేసిన ‘న్యాయం కావాలి’ సినిమా నా లైఫ్‌ లో టర్నింగ్‌ పాయింట్‌ సినిమా. అందులో చిరంజీవిని కొట్టికొట్టి మాట్లాడే సీన్ ఉంటుంది. అందులో చిరంజీవిని చెంప మీద కొట్టాలి. ఈ సీన్ కోసం నేను 23 టేక్స్‌ తీసుకున్నాను. దీంతో చిరంజీవిని 23 సార్లు కొట్టాను. ఆ తర్వాత చూస్తే చిరంజీవి ముఖం మొత్తం రెడ్‌ కలర్‌ అయిపోయింది. అంత గట్టిగా కొట్టేశాను” అని తెలిపింది. సీన్ బాగా రావడానికి ఆర్టిస్టులు యాక్టింగ్ లో ఎంత దూరం అయినా వెళ్తారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు.