Raghav Parineeti : నేడే రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా వివాహం.. భారీ ఖర్చుతో ఘనంగా రాజుల ప్యాలెస్ లో..
రాఘవ్ - పరిణీతి ఫ్యామిలీలు, బంధువులతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి హాజరవుతున్నారు.

Raghav Chaddha Parineeti Chopra Wedding Happening today in Udaipur
Raghav Parineeti : గత కొన్నాళ్లుగా బాలీవుడ్(Bollywood) నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. రాఘవ్ – పరిణీతి వివాహం నేడు రాజస్ధాన్ ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరగబోతుంది.
రాఘవ్ – పరిణీతి ఫ్యామిలీలు, బంధువులతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి హాజరవుతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు బంధువులు ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ కి చేరుకొని హల్దీ, సంగీత్ వేడుకలు నిర్వహించుకున్నారు. వీరి సంగీత్ లోని కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. నేడు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయ్ పూర్ కి చేరుకుంటున్నారు.
ఇక రాఘవ్ – పరిణీతి పెళ్లి కోసం దాదాపు 90 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారని బాలీవుడ్ సమాచారం. ఇక సోషల్ మీడియాలో రాఘవ్ – పరిణీతి పెళ్లి ట్రెండింగ్ లో ఉంది. వీరి పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Raghav chaddha ll Parineeti Chopra #ParineetiRaghavWedding #ParineetiChopra pic.twitter.com/uYYPmc9Sw3
— Rj Armaan (@calmRjarmaan) September 23, 2023