మహానుభావుడు:ఈయనకు ఇవ్వడమే తెలుసులా ఉంది.. ఇస్తూనే ఉన్నాడు..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 05:50 AM IST
మహానుభావుడు:ఈయనకు ఇవ్వడమే తెలుసులా ఉంది.. ఇస్తూనే ఉన్నాడు..

Updated On : April 29, 2020 / 5:50 AM IST

పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయం అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు.

రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, “డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యత గా భావించి వారి అకౌంట్ల కు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగింది” అన్నారు.

తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా సాయం పొందినవారు లారెన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా లారెన్స్ కరోనాపై పోరాటానికి ఇప్పటికే భారీ మొత్తం విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.