Purushothamudu : రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ టీజర్ చూశారా? జూనియర్ ‘శ్రీమంతుడు’లా ఉన్నాడే..
తాజాగా రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

Raj Tarun Purushothamudu Teaser Released
Purushothamudu Teaser : రాజ్ తరుణ్(Raj Tarun) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ వాటి రిలీజ్ లకు రెడీ అవుతున్నాడు. ఇటీవల సంక్రాంతికి నాగార్జున నా సామిరంగా సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసి మెప్పించాడు. త్వరలో పురుషోత్తముడు సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
Also Read : Vidya Vasula Aham : ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్.. పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే..
పురుషోత్తముడు టీజర్ చూస్తుంటే.. బాగా డబ్బున్న ఓ యువకుడు డబ్బు వదిలేసి ఓ పల్లెటూరికి వచ్చి అక్కడ అందరితో మంచిగా ఉంటూ, వాళ్లకు సపోర్ట్ చేస్తూ, పొలం పనులు చేస్తున్నట్టు చూపించారు. టీజర్ చూస్తుంటే శ్రీమంతుడు సినిమా పోలికలు కనిపించాయి. కానీ ఏదో కొత్త పాయింట్ ఉంటుందని మాత్రం అర్ధమవుతుంది. కామెడీ, ఎమోషన్ తో ఈ పురుషోత్తముడు సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా పురుషోత్తముడు టీజర్ చూసేయండి..
ఇక పురుషోత్తముడు సినిమాలో రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా నటిస్తుండగా రమ్యకృష్ణ, మురళీశర్మ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం.. ఇంకా చాలామంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది పురుషోత్తముడు సినిమా.