Rajamouli : జపాన్‌లో భూకంపం.. రాజమౌళి ఫ్యామిలీ అక్కడే.. కార్తికేయ పోస్ట్ వైరల్..

తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ పోస్ట్ వైరల్ అవుతుంది.

Rajamouli : జపాన్‌లో భూకంపం.. రాజమౌళి ఫ్యామిలీ అక్కడే.. కార్తికేయ పోస్ట్ వైరల్..

Rajamouli and his Family at Japan Karthikeya earthquake Post goes Viral

Updated On : March 21, 2024 / 9:51 AM IST

Rajamouli : రాజమౌళి, అతని కుటుంబం ప్రస్తుతం జపాన్(Japan) లో ఉన్న సంగతి తెలిసిందే. RRR సినిమా జపాన్ లో రీ రిలీజ్ చేయడంతో మరోసారి రాజమౌళి కుటుంబంతో సహా జపాన్ వెళ్లారు. జపాన్ లో RRR సక్సెస్ తో పటు వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ పోస్ట్ వైరల్ అవుతుంది.

కార్తికేయ తన ట్విట్టర్ లో.. ఇప్పుడే జపాన్‌లో భూకంపం వచ్చింది. మేము 28వ అంతస్తులో ఉన్నాము. భూమి నెమ్మదిగా కదలడం ప్రారంభించి పై దాకా వచ్చింది. అది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. మేము భయపడ్డాము కానీ జపాన్ వాళ్లంతా అసలు పట్టించుకోలేదు. లైఫ్ లో ఒక్కసారన్నా భూకంపంని ఫీల్ అవ్వాలి అనుకున్నాను, ఆ కోరిక తీరింది అని పోస్ట్ చేసాడు. అలాగే తన స్మార్ట్ ఫోన్ లో భూకంపం వస్తుంది అని వచ్చిన వార్నింగ్ ని ఫోటో తీసి షేర్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : Ram Charan – Janhvi Kapoor : అప్పుడే RC 16 పనులు మొదలుపెట్టేశారా? చరణ్‌తో జాన్వీ డిస్కషన్స్.. ఫొటోలు వైరల్..

అయితే అది పెద్ద భూకంపం కాదు. కేవలం భూమి కంపించింది. జపాన్ లో భూకంపాలు సర్వ సాధారణం. అక్కడి ప్రజలు కూడా వాటికి అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు వచ్చిన భూకంపం చాలా చిన్నది. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. రాజమౌళి కుటుంబ సభ్యులంతా సేఫ్ గానే ఉన్నారు.