Rajamouli : అంతర్జాతీయ వేదికపై ‘మేరా భారత్ మహాన్’ అన్న రాజమౌళి.. దయచేసి ఆ అవార్డు కేటగిరి పెట్టండి అంటూ విన్నపం..

రాజమౌళి మాట్లాడిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. రాజమౌళి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో ‘బెస్ట్‌ స్టంట్స్‌’, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’ అవార్డుల్ని అందుకొని వేదికపై మాట్లాడాడు. రాజమౌళి మాట్లాడుతూ...........

Rajamouli : అంతర్జాతీయ వేదికపై ‘మేరా భారత్ మహాన్’ అన్న రాజమౌళి.. దయచేసి ఆ అవార్డు కేటగిరి పెట్టండి అంటూ విన్నపం..

Rajamouli Speech at Hollywood Critic Association Awards Ceremony

Updated On : February 25, 2023 / 4:14 PM IST

Rajamouli :  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా గత సంవత్సర కాలంగా సాధిస్తున్న ఓ వైపు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ, మరో వైపు భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి ఇంకో వైపు అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల్ని సాధిస్తుంది. ఇక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. త్వరలో ఈ ఆస్కార్ అవార్డు కార్యక్రమం ఉండటంతో పాటు, RRR ని హాలీవుడ్ లో రీ రిలీజ్ చేస్తుండటం, మరిన్ని అవార్డు వేడుకలు ఉండటంతో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్.. మరికొంతమంది RRR యూనిట్ అమెరికాలోనే ఉంటూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ RRRని మరింత ప్రమోట్ చేస్తున్నారు.

తాజాగా RRR సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు వచ్చాయి. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమాకు ఏకంగా అయిదు అవార్డులు వరించాయి. గతంలో డిసెంబర్ లోనే విదేశాల్లోనూ విశేష ప్రజాదరణ పొందిన చిత్రంగా RRR సినిమాకు HCA స్పాట్ లైట్ అవార్డు ప్రకటించారు. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం శుక్రవారం ఫిబ్రవరి 24 రాత్రి జరిగింది. ఈ అవార్డు వేడుకల్లో RRR సినిమాకు ‘బెస్ట్‌ స్టంట్స్‌’, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, ‘బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌’(నాటు నాటు), ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’ విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. దీంతో స్పాట్ లైట్ అవార్డుతో కలిపి మొత్తం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో అయిదు అవార్డుల్ని RRR సినిమా సొంతం చేసుకుంది. ఈ అవార్డుల్ని రాజమౌళి, కీరవాణి అందుకున్నారు.

అయితే ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. రాజమౌళి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో ‘బెస్ట్‌ స్టంట్స్‌’, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’ అవార్డుల్ని అందుకొని వేదికపై మాట్లాడాడు. రాజమౌళి మాట్లాడుతూ.. ఇన్ని అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డులతో మేము ఇంకా పైకి ఎదగగలం అని భావిస్తున్నాము. RRR సినిమాకు బెస్ట్ స్టంట్స్‌ అవార్డుని, బెస్ట్ యాక్షన్ ఫిలిం అవార్డుని అందించిన HCA కు ధన్యవాదాలు. ఈ సినిమాకి స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్, క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ని కంపోజ్ చేసిన జూజీతో పాటు మా కోసం భారతదేశం వచ్చి పనిచేసిన మరికొంతమంది స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ అందరికి కృతజ్ఞతలు. వాళ్ళు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.

ఈ సినిమాని నేను మొత్తం 320 రోజులు షూట్ చేస్తే అందులో చాలా వరకు స్టంట్స్‌ సీన్స్ కోసమే అయ్యాయి. ఈ సినిమాలో రెండు, మూడు సీన్స్ లో మాత్రమే డూప్స్ వాడాము. మిగిలిన అన్ని సీన్స్ లోనూ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్వయంగా చేశారు. నా తరపున అవార్డ్స్ ఇచ్చే వాళ్లందరికీ ఒక విన్నపం. స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ లేకపోతే ఇంత మంచి యాక్షన్ సినిమాలు రావు. కాబట్టి వారికి కూడా బెస్ట్ స్టంట్స్‌ కొరియోగ్రాఫర్ గా ఒక కేటగిరి ఉండాలని భావిస్తున్నాను. నా సినిమా స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని సినిమాల స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ కి చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే మంచి మంచి యాక్షన్స్ సీన్స్ రావు. మమ్మల్ని అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్యూ. అలాగే ఈ అవార్డులు నాకు మాత్రమే కాదు మా ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం. మా ఇండియన్ కథలకు దక్కిన గౌరవం. థ్యాంక్యూ. మేరా భారత్ మహాన్ అని అన్నారు.

RRR at HCA : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు.. ఏకంగా అయిదు అవార్డులు కొల్లగొట్టిన RRR

రాజమౌళి స్పీచ్ కి అక్కడున్న వాళ్లంతా ఫిదా య్యారు. స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ గురించి గొప్పగా చెప్పడం, వాళ్ళకి కూడా అవార్డులు ఇవ్వాలంటూ విన్నవించడం, చివర్లో మేరా భారత్ మహాన్ అనడంతో స్పీచ్ వైరల్ గా మారింది. ఈ స్పీచ్ విన్నవాళ్లంతా రాజమౌళిని అభినందిస్తున్నారు. సినిమాలతోనే కాదు తన మాటలతో కూడా రాజమౌళి భారతదేశానికి మరింత మంచి పేరు తెస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.