మనసున్న మారాజు : నిరుపేద కళాకారులకు రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత
కరోనా ఎఫెక్ట్: నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్..

కరోనా ఎఫెక్ట్: నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్..
కరోనా మహమ్మారి ప్రభావంతో షూటింగులు నిలిచిపోయాయి. రోజు వారి కూలికి పనిచేసే సినీ కార్మికులు, నిరుపేద కళాకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు సినీ పెద్దలు వారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. రాజశేఖర్ తన చారిటబుల్ ట్రస్ట్ తరపున అలాంటివారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు.
రోటీ కపడా ఔర్ మకాన్ అంటే… ఆహారం, దుస్తులు, తల దాచుకోవడానికి ఓ గూడు (ఇల్లు)… హాయిగా జీవితం సాగించడానికి మనుషులకు కావాల్సినవి. ఇల్లు, దుస్తులు ఉన్నప్పటికీ… కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సరైన ఆహారం దొరక్క కొంతమంది కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద మనసుతో అటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. రెండొందల మందికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల పంచదార, కేజీ ఉప్పు, అర కేజీ కారం, పావుకిలో టీ పొడి, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీల ఆట, పావు కిలో పచ్చడి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. మరో రెండు వందల మందికి నిత్యావసరాలు అందజేయనున్నారు.