Rajendra Prasad : రాజేంద్రప్రసాద్‌ చిన్నప్పటి కన్నీటికథ.. అమ్మ కోసం ఎదురుచూపుతో ప్రాణాలు మీదకు..

'కృష్ణారామా' సినిమా ప్రమోషన్స్ లో 'సుమ అడ్డా' షోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్.. తన చిన్నప్పటి కన్నీటికథని చెప్పి అందరి మనసుని బరువెక్కించాడు.

Rajendra Prasad : రాజేంద్రప్రసాద్‌ చిన్నప్పటి కన్నీటికథ.. అమ్మ కోసం ఎదురుచూపుతో ప్రాణాలు మీదకు..

Rajendra Prasad shares his childhood memory about dasara and his mother

Updated On : October 17, 2023 / 11:02 AM IST

Rajendra Prasad : తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్నారు. మద్యమద్యలో తనే ప్రధాన పాత్ర పోషిస్తూ కొన్ని మంచి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈక్రమంలోనే ఈ దసరా పండక్కి ‘కృష్ణారామా’ అనే మూవీని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. డైరెక్టర్ రాజు మదిరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గౌతమి, అనన్య శర్మ, రవి వర్మ, రచ్చ రవి, జెమినీ సురేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా ఈ చిత్ర యూనిట్ ‘సుమ అడ్డా’ షోకి గెస్ట్‌లుగా వచ్చారు. రాజేంద్రప్రసాద్‌, గౌతమి, రచ్చ రవి, డైరెక్టర్ రాజు మదిరాజు ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో సుమతో కలిసి వీరంతా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. అయితే ప్రోమో చివరిలో మాత్రం రాజేంద్ర ప్రసాద్ తన చిన్నప్పటి కథని చెప్పి అందరి మనసుని బరువెక్కించాడు. దసరా పండగని చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్‌ చేసుకునే వారు అని సుమ అడిగిన ప్రసన్నకు రాజేంద్ర ప్రసాద్ చెప్పిన సమాధానం కన్నీరు పెట్టిస్తుంది.

Also read : Movie Releases in Telugu : ఈ దసరాకి థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలివే..

రాజేంద్ర ప్రసాద్ చిన్నతనంలోనే తల్లి చనిపోయిందట. ఇక అమ్మ కోసం ఎదురుచూపుతో ప్రాణాలు మీదకు తెచ్చుకొని చచ్చిపోయే స్టేజ్‌కి వెళ్ళాడట. ఇక తన పరిస్థితి చూసిన ఇనిట్లో వారు.. రాజేంద్ర ప్రసాద్ ని కనక దుర్గ గుడికి తీసుకోని వెళ్లి.. ఇక నుంచి మీ అమ్మ ఇక్కడే ఉంటుందని చెప్పారంట. దీంతో అప్పటి నుంచి ఆ కనకదుర్గమ్మనే అమ్మగా భవిస్తూ పెరిగినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.