Rajendraprasad : అమెరికాలో తానా మహాసభలకు నటకిరీటీ రాజేంద్రప్రసాద్..
త్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో...

Rajendraprasad attending to TANA Mahasabhalu in America
TANA : ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. గద్దె రాజేంద్రప్రసాద్ గారిని ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటులుగా పేరు పొందిన రాజేంద్రప్రసాద్ నటుడిగానే కాకుండా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు. తన మాటలతో, హావభావాలతో ఆకట్టుకునే రాజేంద్రప్రసాద్ తానా మహాసభల్లో కూడా అందరినీ అలరించనున్నారు. ఎన్నో కార్యక్రమాలతో సంగీత విభావరులతో అలరించే తానా మహాసభలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Sreeleela : శ్రీలీలను ఎత్తుకున్న బన్నీ.. ఈ కాంబినేషన్‌లో ఆహా కోసం స్పెషల్ మూవీ?
మీరు కూడా తానా మహాసభలకు రావాలనుకుంటే మహాసభలకోసం మీ పేర్లను ఇక్కడ రిజిష్టర్ చేసుకోండి. https://tanaconference.org/event-registration.html ఈ సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకొని తానా మహాసభల్లో పాల్గొనవచ్చు.