Rajendraprasad : ఆయన బతికుంటే బంగారు పూలతో పాద పూజ చేసేవాడిని..
సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి మీడియాతో..........

Rajendraprasad
NTR : ఇవాళ మే 28న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి. తెలుగు వారి యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇక ఉదయం నుంచే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి మీడియాతో మాట్లాడారు.
NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ”ఆయన ద్వారానే నేను మద్రాస్ ఫిలిం స్కూల్‌లో చేరాను. ఆయన పెట్టిన భిక్ష వల్లే మంచి నటుడిగా మీ ముందు ఉన్నాను. మనతో ఉన్న పది మందికి సాయం చెయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి. కొన్ని సంవత్సరాలు ఆయన పక్కనే ఉండి ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. సమాజమే దేవాలయం అన్న మహా మనిషి ఆయన. ఈ రోజు మా పెద్దాయన బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడిని. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు మన అందరిపైనా ఉంటాయి’’ అని తెలిపారు.