Rajinikanth : 33 ఏళ్ల తరువాత అమితాబ్ బచ్చన్‌తో రజినీకాంత్.. ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు కలిసి నటించి చాన్నాళ్లు అయ్యింది.

Amitabh Bachchan-Rajinikanth
Rajinikanth- Amitabh Bachchan : సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు కలిసి నటించి చాన్నాళ్లు అయ్యింది. అప్పుడెప్పుడో 33 ఏళ్ల క్రితం వీరిద్దరు కలిసి నటించారు. అప్పటి నుంచి మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు అభిమానుల కోరిక నెరవేరబోతుంది. లెజెండరీ నటులు అమితాబ్, రజినీకాంత్‌లు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేనా.. ఈ ఇద్దరు కలిసి దిగిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
జైలర్ సినిమా తరువాత రజినీకాంత్ తలైవర్ 170 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్నికి ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్ లు నటిస్తున్నారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు.
Bigg Boss 7 : మునుగుతాయా..? తేలుతాయా..? బుర్రకు పదును పెట్టాల్సిందే..?
ఈ విషయాన్ని రజినీకాంత్ తెలియజేశారు. అమితాబ్‌తో దిగిన ఓ ఫోటోను X (గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు)లో పంచుకున్నారు. ’33 ఏళ్ల తరువాత నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్ బచ్చన్‌తో కలిసి పని చేస్తున్నా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న తలైవర్ 170 చిత్రంలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అమితానందంతో నా గుండె కొట్టుకుంటోంది.’ అని రజినీకాంత్ అన్నారు.
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లు 1980లలో అంధాకా నూన్, గిరాఫ్తార్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆఖరుగా 1991లో రిలీజైన ముకుల్ ఎస్ ఆనంద్ యొక్క ‘హమ్’ తరువాత వీరు కలిసి నటించలేదు. ఇన్నేళ్లకు వీరిద్దరు కలిసి ఓ చిత్రంలో నటిస్తుండడంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.
After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s “Thalaivar 170” directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y
— Rajinikanth (@rajinikanth) October 25, 2023