Sarath Babu : శరత్ బాబు అంతిమ యాత్రకు తరలివచ్చిన తలైవా.. నా ఆరోగ్యం కోసం ఆలోచించేవాడు అంటూ ఎమోషనల్ అయి..
చెన్నైలో కూడా పలువురు తమిళ సినీ ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రత్ బాబుకి నివాళులు అర్పించారు.

Rajinikanth paid tribute to Sarath Babu in Chennai
Rajinikanth : ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే నిన్న మే 22 సాయంత్రం మరణించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 3000కి పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. ఆయన మరణంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
నిన్న మే 22 రాత్రి వరకు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాద్(Hyderabad) ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం నిన్న రాత్రి శరత్ బాబు భౌతికకాయాన్ని చెన్నైకు తరలించారు. చెన్నై(Chennai)లో శరత్ బాబు అంత్యక్రియలు ఇండస్ట్రియల్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. చెన్నైలో కూడా పలువురు తమిళ సినీ ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రత్ బాబుకి నివాళులు అర్పించారు.
Sarath Babu : నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు..
రజినీకాంత్ శరత్ బాబుకి నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. ముత్తు, అన్నామలై, వేలైక్కారన్.. ఇలా దాదాపు ఓ 10 సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించాము. నేను ఎప్పుడు సిగరెట్ తాగినా నోట్లోంచి లాక్కొని పడేసేవాడు. నా ఆరోగ్యం కోసం ఎప్పుడూ ఆలోచించేవాడు. ఆరోగ్యంగా ఉండమని చెప్పేవాడు. నేను సరిగ్గా నటించలేనప్పుడు నా పక్కన వచ్చి కూర్చొని ప్రోత్సహించేవాడు. ఎన్నో ఏళ్లుగా మా స్నేహం సాగుతోంది అంటూ ఎమోషనల్ అయ్యారు రజినీకాంత్.