రజినీ మాటిచ్చాడు – నిలబెట్టుకున్నాడు

రజినీకాంత్ నటించిన మొదటి సినిమా ‘భైరవి’ నిర్మాత కలైజ్ఞానంకు ఇల్లు బహుమతిగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు..

  • Published By: sekhar ,Published On : October 7, 2019 / 11:39 AM IST
రజినీ మాటిచ్చాడు – నిలబెట్టుకున్నాడు

Updated On : October 7, 2019 / 11:39 AM IST

రజినీకాంత్ నటించిన మొదటి సినిమా ‘భైరవి’ నిర్మాత కలైజ్ఞానంకు ఇల్లు బహుమతిగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇచ్చిన మాట మీద నిలబడి.. మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. తలైవా ఇచ్చిన మాట ప్రకారం తన మొదటి సినిమా నిర్మాతకు అండగా నిలిచారు. అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలిసి ఆ నిర్మాతకు ఇల్లు బహుమతిగా ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కలైజ్ఞానం కోలుకోలేని నష్టాలను ఎదుర్కొన్నారు.

అయితే.. గత నెల కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ సభకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలైజ్ఞానం పరిస్థితి గురించి తెలుసుకున్న రజిని సభలోనే అందరి ముందు ఆయనకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. వీలైనంత త్వరగా ఆయనకు సొంత ఇల్లు ఏర్పాటుచేస్తానని చెప్పిన రజినీ.. చెప్పినట్టుగానే  కలైజ్ఞానంకు ఇల్లు కొన్నారు..

Read Also : కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టిన సూపర్ స్టార్!

అక్టోబర్ 7వ తేదీ దగ్గరుండి మరీ  ఆయన చేత గృహప్రవేశం చేయించారు రజిని.. రజినీకాంత్ నటించిన మొదటి సినిమా ‘భైరవి’ని కలైజ్ఞానం నిర్మించారు. విలన్‌గా నటిస్తుండగా హీరోగా చేస్తే బావుంటుందనే ఆయన సలహా ద్వారానే రజినీకాంత్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు నిర్మాతను ఆదుకున్నారు. రజినీ మంచి మనసుకు సినీ రంగ ప్రముఖులు, ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.