Thalaivar 170 : జైలర్‌లో ఆ స్టార్ హీరోలు.. 170వ మూవీలో ఈ స్టార్ హీరోలు.. రజిని ప్లాన్ మాములుగా లేదుగా..

జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో కలిసి బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్ ఇప్పుడు తన 170వ సినిమా కోసం..

Thalaivar 170 : జైలర్‌లో ఆ స్టార్ హీరోలు.. 170వ మూవీలో ఈ స్టార్ హీరోలు.. రజిని ప్లాన్ మాములుగా లేదుగా..

Rajinikanth Thalaivar 170 movie total cast and crew details

Thalaivar 170 : జైలర్ సినిమాతో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు. ఇక సక్సెస్ ని కంటిన్యూ చేసేలా రజిని తన సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ఈక్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘లాల్ సలాం’ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో రజిని కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడు. కాగా ఫ్యాన్స్ అంతా టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే తలైవర్ 170వ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

కాగా జైలర్ సినిమా మాదిరి ఈ సినిమాలో కూడా పలువురు స్టార్ హీరోలు కనిపించబోతున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కొందరు స్టార్స్ పేరులు కూడా వినిపించాయి. ఇప్పుడు ఆ పేర్లనే చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కనిపిస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ హల్క్ రానా ఈ మూవీలో ముఖ్య పాత్రలు చేయబోతున్నారు.

Also Read : Boney Kapoor : బోనీ క‌పూర్ వ్యాఖ్య‌లు వైర‌ల్.. శ్రీదేవితో నా పెళ్లికి ముందే జాన్వీ కపూర్..?

ఇక ఈ హీరోలతో పాటు మంజూ వారియ‌ర్, రితికా సింగ్, దుషారా విజయన్ ముద్దుగుమ్మలు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. నార్త్ టు సౌత్ బడా స్టార్స్ అంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడంతో ఈ మూవీ పై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. దర్శకుడు టీజే జ్ఞానవేళ్‌ తన గత సినిమా ‘జై భీమ్’ లాగానే ఈ చిత్రం కూడా సోషల్ మెసేజ్ తో ఉండబోతుందని సమాచారం.