ఐదేళ్లుగా ఏసీ రూమ్ ల్లోనే రూ.10కే భోజనం పెడుతున్న రజనీకాంత్ వీరాభిమాని
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని సేవా దృక్పథంతో కేవలం రూ.10లకే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. కూలీలు, కార్మికుల ఆకలి తీర్చుతున్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని సేవా దృక్పథంతో కేవలం రూ.10లకే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. కూలీలు, కార్మికుల ఆకలి తీర్చుతున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని సేవా దృక్పథంతో ఐదేళ్లుగా కేవలం రూ.10లకే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. కూలీలు, కార్మికుల ఆకలి తీర్చుతున్నారు. వీరబాబు అనే రజనీకాంత్ వీరాభిమాని చెన్నైలోని సాలిగ్రామంలో హోటల్‌ను నడుపుతున్నాడు. సాధారణ గదిలో కూర్చొని భోజనం చేసినా, ఏసీ గదిలో కూర్చొని చేసినా..ప్లేట్ భోజనంకు రూ.10లు, అన్ లిమిటెడ్ భోజనంకు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర హోటళ్లకు ధీటుగా అన్నంతో పాటు సాంబార్, రెండు రకాల కర్రీస్, రసం, మజ్జిగ వడ్డిస్తారు.
ఈ హోటల్‌లోని ఏసీ గదిలో కూర్చొని భోజనం చేసినా ప్రత్యేక ఛార్జీలేవీ వసూలు చేయకపోవడం విశేషం. అతి తక్కువ ధరకే కడుపునింపుతున్నారు. కార్మికులు, కూలీలతో ఆ హోటల్ మధ్యాహ్న వేళల్లో కిటకిటలాడుతోంది. ఈ హోటల్ గురించి సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగడంతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇక్కడికి చేయడానికి భోజనం వస్తుంటారు.
ఏసీ హోటల్స్‌లో మధ్యాహ్న భోజనం అంటే రూ.100కు పై మాటే. చిన్న హోటల్స్‌లో కూడా రూ.70-100 వసూలు చేస్తుండగా…ఇక్కడ కేవలం రూ.30లకు అన్ లిమిటెడ్ భోజనంతో కడుపు నింపుకోగలుగుతున్నామని కార్మికులు, కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘శ్రమజీవి హోటల్’ పేరుతో నడుస్తున్న ఈ హోటల్ బ్రాంచ్‌లను చెన్నైలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. చెన్నై మహా నగరంలో ప్లేట్ భోజనాన్ని కేవలం రూ.10లకు వడ్డిస్తున్నారంటే ఊహించలేము. రజనీకాంత్ అభిమానిగా వీరబాబు సేవా దృక్పథంతో లాభాపేక్ష లేకుండా హోటల్‌ను నడుపుతున్నట్లు వీరబాబు తెలిపారు.
ఉదయం, రాత్రి హోటల్‌ను నడపడం ద్వారా కొంత మేరకు లాభం వస్తుందని, మధ్యాహ్న భోజనం ద్వారా ఏర్పడే నష్టాన్ని దానితో భర్తీ చేసుకుంటున్నట్లు చెప్పారు. కొందరు భోజనం తమకు బాగా నచ్చడంతో రూ.10లు ధర పలికే ప్లేట్ మీల్స్‌కు కూడా రూ.30లు ఇచ్చి వెళ్తుండగా..వారి సేవా దృక్పథాన్ని మెచ్చుకుంటూ కొందరు కష్టమర్లు రూ.100 ఇచ్చి వెళ్తుంటారు. దాని ద్వారా కూడా కాస్త నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆయన అభిమానులు ఇలాంటి హోటల్స్ నడుపుతున్నారు. ఇలాంటి రజనీకాంత్ వీరాభిమానులు తమిళనాడులో చాలా మందే ఉన్నారు.
తెలిసిన వివరాల ప్రకారం డాక్టర్ అయిన వీరబాబు మనపక్కం వద్ద రజనీకాంత్ పోస్టర్లతో హోటల్‌ను ఏర్పాటు చేశాడు. భోజనం కాకుండా, దోశ, ఇడ్లీలతోపాటు ఇతర బియ్యం రకాలు కూడా మెనూలో ఉన్నాయి. సరసమైన ధరల్లో, ఆరోగ్యకరమైన భోజనం అందించడం ఆసక్తికరమైన విషయం. ప్రత్యేకంగా డయాబెటిక్ రోగులకు భోజనం, ఎముకలను బలోపేతం చేయడానికి భోజనం కూడా ఉన్నాయని నివేదికలు పేర్కొన్నాయి. డాక్టర్ వీరబాబు తన రెస్టారెంట్‌లో ప్రజలకు మూలికా ఆహారాన్ని అందించాలని కోరుకుంటున్నారని, అది వారికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదని పేర్కొంది.
హోటల్ కు పెద్ద ప్రయోజనం ఉంది. ఈ హోటల్ తో రజనీకాంత్ కు ప్రజాదరణ పెరగాలని, రాజకీయ పయనంలో ఎక్కువ మంది ప్రజలు రజనీకి మద్దతు ఇస్తారని అంటున్నారు. రజీనీ మంచి వ్యక్తి అని, తన రాజకీయ ప్రస్థానంతో మొత్తాన్ని మారుస్తుందని డాక్టర్ వీరబాబు అన్నారు. కొంతమంది భోజనం చేస్తున్న వీడియోను ఒక అభిమాని షేర్ చేశారు.
రజనీకాంత్ తన ఈ అభిమాని గురించి చదివారో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ రజనీ తన ట్విట్టర్ ద్వారా అతనికి కృతజ్ఞతలు తెలిపారు. “నా అభిమానులందరికీ, వివిధ రంగాలకు చెందిన శ్రేయోభిలాషులు, మిత్రులకు, సినీ పరిశ్రమకు చెందిన నా సహచరులు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరికీ మరియు మీ అందరికీ నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని తెలిపారు.
Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్