కపూర్ కుటంబంలో విషాదం.. రాజీవ్ కపూర్ కన్నుమూత..

కపూర్ కుటంబంలో విషాదం.. రాజీవ్ కపూర్ కన్నుమూత..

Updated On : February 9, 2021 / 3:31 PM IST

Rajiv Kapoor: బాలీవుడ్‌ కపూర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రిషి కపూర్ మరణ వార్త మరచిపోకముందే రాజీవ్‌ కపూర్‌ (58)ను కోల్పోవడంతో ఆ కుటుంబంలో మరోసారి విషాదం నెలకొంది. రాజీవ్‌ కపూర్‌ గుండె పోటుతో కన్నుమూశారు. రణధీర్‌ కపూర్‌, దివంగత రిషికపూర్‌ సోదరుడే రాజీవ్‌ కపూర్‌.

Rajiv Kapoor

రాజ్‌ కపూర్‌ కుమారుడైన రాజీవ్‌ కపూర్‌ ‘రామ్ తేరి గంగా మెయిలీ’, ‘ఏక్ జాన్ హై హమ్’ వంటి సినిమాల్లో నటించారు. రాజీవ్ కపూర్.. నిర్మాతగానూ వ్యవహరించడమే కాకుండా.. ‘ప్రేమ్‌ గ్రంథ్‌’ సినిమాను డైరెక్ట్ చేశారు. రాజీవ్ కపూర్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Rajiv Kapoor