Rakasa-Biker: థియేటర్స్ లో తగ్గిన ‘ధురందర్ 2’ జోరు.. బైకర్, రాకాస సినిమాలకు లైన్ క్లియర్
సమ్మర్ సీజన్ లో బాక్సాఫీస్ వేటకు సిద్ధమైన రెండు తెలుగు సినిమాలు రాకాస, బైకర్(Rakasa-Biker).
rakasa and biker movies getting huge release in telugu states
- సమ్మర్ సీజన్లో తెలుగు సినిమాలకు సూపర్ ఛాన్స్
- బాక్సాఫీస్ రేసులో బైకర్, రాక్షస
- రేపటి టాక్ పైనే అందరి కళ్లు
Rakasa-Biker: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్ 2’ చిత్రం గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద రికార్డుగా సునామి సృష్టిస్తూనే ఉంది. రూ.2000 కోట్ల రికార్డ్స్ కలెక్షన్స్ దిశగా ఈ సినిమా సాగుతోంది. అయితే, ధురంధర్ 2 సినిమా విడుదలై రెండో వీకెండ్ కూడా కంప్లీట్ అవడంతో ప్రస్తుతం దాని వసూళ్ల హవా కాస్త తగ్గింది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తెలుగు, హిందీ వెర్షన్లలో భారీ వసూళ్లు సాధించినా, రెండో వారానికి వచ్చేసరికి థియేటర్ల సంఖ్య తగ్గింది.
Karunakaran: ఎనిమిదేళ్ల తర్వాత ‘తొలిప్రేమ’ దర్శకుడి రీ-ఎంట్రీ.. క్రేజీగా కొత్త ప్రాజెక్ట్
ఈ పరిణామం ఏప్రిల్ 3న విడుదల అవుతున్న బైకర్, రాకాస(Rakasa-Biker) సినిమాలకు కలిసివచ్చే అంశంగా మారింది. రణవీర్ సినిమా జోరు తగ్గడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ
రెండు కొత్త సినిమాలపై పడింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అందులోను ‘బైకర్’ చిత్రం యువతను ఆకట్టుకుంటుండగా, రాకాస సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది.
ఈ రెండు సినిమాలకు థియేటర్ల కౌంట్ పెరగడం అనేది వరంగా మారింది. కథలో దమ్ము ఉంటే, సమ్మర్ సీజన్ ప్రారంభంలో ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం. పెద్ద సినిమాల విడుదల కూడా లేకపోవడం కూడా ఈ రెండు సినిమాలకు కలిసొచ్చే అంశమే. మరి అద్భుతమైన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.
