Rakendu Mouli : బన్నీ వాసు అలా.. రాకేందు మౌళి ఇలా.. హిట్ అయినా కనీసం గుర్తింపు ఇవ్వలేదు.. సంచలన వ్యాఖ్యలు..
తాజాగా రాకేందు మౌళి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. (Rakendu Mouli)
Rakendu Mouli
Rakendu Mouli : సినీ పరిశ్రమలో పని చేయించుకొని క్రెడిట్స్ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు అని అప్పుడప్పుడు పలువురు కామెంట్స్ చేస్తారు. అయితే గుర్తింపు లేని సమయంలో, కెరీర్ ఆరంభంలో జరిగితే ఎవరూ పట్టించుకోరు. కానీ గుర్తింపు వచ్చిన తర్వాత కూడా కనీసం పట్టించుకోకపోతే ఫీల్ అవుతారు, అది చర్చగా మారుతుంది. తాజాగా రచయిత, లిరిసిస్ట్ రాకేందు మౌళి ఓ సినిమా విషయంలో బాగా ఫీల్ అయ్యాడు.(Rakendu Mouli)
ఎన్నో సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్, సాంగ్స్ రాసాడు రాకేందు మౌళి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు తెలుగులో హిట్ అవ్వాలంటే రాకేందు మౌళినే రచయితగా తీసుకుంటారు. ఇటీవల మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమా వచ్చి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు తెలుగులో పాటలు, డైలాగ్స్ రాకేందు మౌళినే రాసాడు.
ఈ సినిమాకు రాకేందు మౌళిని అందరూ అభినందించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ కి కనీసం రాకేందు మౌళిని ఎవరూ పిలవలేదు. కనీసం ఈవెంట్లో ఎవరూ రాకేందు మౌళి గురించి మాట్లాడలేదు. దీంతో ఈ విషయం అప్పట్లోనే చర్చగా మారింది. అనంతరం ఓ సినిమా ఈవెంట్లో బన్నీ వాసుని దీని గురించి అడిగితే.. మెయిన్ వాళ్ళు మిస్ అవ్వరు. ఆయన ఎక్కడో ఉండి ఉంటారు. అందుబాటులో లేక వచ్చి ఉండరు అని అన్నారు. అయితే తాజాగా రాకేందు మౌళి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
Rakendu Mouli
మహావతార్ నరసింహ సక్సెస్ మీట్ లో పాల్గొనకపోవడంపై రాకేందు మౌళి మాట్లాడుతూ.. నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు అసలు. నన్నేం చేయమంటారు. గీత ఆర్ట్స్ వాళ్ళను అడగండి. ఆ సినిమాకు డైలాగ్స్, సాంగ్స్ నేనే రాసాను. తెలుగులోనే పెద్ద హిట్ అయింది. కనీసం సక్సెస్ మీట్ గురించి చెప్పాల్సింది. సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ గారు, తనికెళ్ళ భరణి గారు, జొన్న విత్తుల గారు వీళ్లంతా వచ్చారు. వాళ్ళు హడావిడిలో మర్చిపోయారేమో కానీ రైటర్ కి మినిమమ్ గుర్తింపు ఉండాలి. నేను దీని గురించి మాట్లాడేవాడిని కాదు కానీ ఒక జర్నలిస్ట్ దీనిని ఖండిస్తూ పోస్ట్ పెట్టాడు. అందుకే మాట్లాడుతున్నాను.
ఆ సినిమాలో డైలాగ్స్, పాటలు నేనే రాసాను. హిందీ లిరిక్స్ ని రీమేక్ చేసి నేను రాయలేదు. తెలుగులో పాటలు సొంతంగా రాసాను. కానీ హిందీ లిరిక్స్ రాసిన ఆయన పేరు రాసి తర్వాత నా పేరు వేశారు. కనీసం నాకు చెప్పలేదు. ఎంతవరకు కరెక్ట్ అది. క్రెడిట్స్ ఇవ్వలేదు ఎక్కడా. మొదట నాకు ఏం చెప్పలేదు. ఇప్పటికి మహావతార్ సినిమా గురించే నాకు కాల్స్, మెసేజెస్ వస్తాయి. ఒరిజినల్ లో కూడా లేని మంచి లైన్స్ తెలుగులో రాసాను. క్రెడిట్స్ గురించి నేను ఇంక ఎవర్ని అడగలేదు అని అన్నారు. దీంతో రాకేందు మౌళి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఇకముందైనా రచయితలకు సరైన గుర్తింపు ఇస్తారా చూడాలి.
Also Read : Premante Trailer : ‘ప్రేమంటే’ ట్రైలర్ వచ్చేసింది.. కానిస్టేబుల్ గా యాంకర్ సుమ..
