Rakesh Varre : సెలబ్రిటీల మీద ఫైర్ అయిన హీరో.. ఎవరూ రారు, సపోర్ట్ చేయరు.. బాహుబలి నటుడు సంచలన వ్యాఖ్యలు..

తాజాగా జితేందర్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా రాకేష్ వర్రే మాట్లాడుతూ..

Rakesh Varre : సెలబ్రిటీల మీద ఫైర్ అయిన హీరో.. ఎవరూ రారు, సపోర్ట్ చేయరు.. బాహుబలి నటుడు సంచలన వ్యాఖ్యలు..

Rakesh Varre Sensational Comments on Movie Celebrities in Jithendar Reddy Pre Release Event

Updated On : November 6, 2024 / 4:30 PM IST

Rakesh Varre: ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగేవాళ్ళు ఏదైనా ఒక స్టేజి దొరికితే తమ కష్టాలని ఒక్కసారిగా వెళ్లబోస్తారు. ఇటీవల కిరణ్ అబ్బవరం తనపై వస్తున్న నెగిటివిటి గురించి మాట్లాడుతూ, తన కష్టాలను చెప్తూ ఫైర్ అయ్యాడు. హీరో చేతన్ మద్దినేని కూడా చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదని తాజాగా ఓ ఈవెంట్లో ఫైర్ అయ్యాడు. తాజాగా హీరో రాకేష్ వర్రే తన సినిమా జితేందర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా విషయాలు మాట్లాడుతూ ఫైర్ అయ్యారు.

బాహుబలి, గూఢచారి.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఎవరికీ చెప్పొద్దూ సినిమాతో హీరోగా, నిర్మాతగా మారాడు. ఆ తర్వాత పేకమేడలు సినిమాని నిర్మించాడు. తాజాగా గతంలో నక్సలైట్స్ తో ప్రజల కోసం పోరాడిన ఓ తెలంగాణ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ లో రాకేష్ వర్రే నటించారు. సంవత్సర కాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది.

Also Read : Nara Rohit : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నారా రోహిత్.. రౌద్రంతో ఫస్ట్ లుక్ అదిరిందిగా..

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా రాకేష్ వర్రే మాట్లాడుతూ.. ఎవరికీ చెప్పొద్దు సినిమా తర్వాత చేస్తే మంచి కంటెంట్ చేయాలి అనుకున్నాను. ఆ సినిమాకు నేను నిర్మాత. అందుకే ఆడే కంటెంట్ ఉన్న సినిమానే చేయాలి అనుకున్నాను. నేను బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేద్దామని పేకమేడలు సినిమా చేసాను నిర్మాతగా. కానీ నేను చేసిన తప్పు అదే. మార్కెట్ లేకపోతే ఏ హీరోని ఎవరూ పట్టించుకోరు. నేను కాబట్టి పేకమేడలు సినిమా మూడేళ్లు పట్టింది. వేరే బ్రాండ్ ఉన్న నిర్మాత అయితే తొందరగా వచ్చేది. నాకు చాలా సమయం, డబ్బులు పేకమేడల వల్ల వేస్ట్ అయ్యాయి. ఆ సినిమాతో ఒక లెస్సన్ నేర్చుకున్నాను. నేను బ్రాండ్ అయ్యాకే కొత్తవాళ్లకు సపోర్ట్ ఇస్తాను. అప్పటి దాకా నిర్మాతగా సినిమాలు చెయ్యను అని అన్నారు.

అలాగే సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సెలబ్రిటీస్ గెస్టులుగా రారు. ఫ్రెండ్షిప్ మీదో, ఆబ్లిగేషన్ మీదో వస్తారు సెలబ్రిటీస్. ఒక సెలబ్రిటీ ఉంటేనే సినిమా ప్రమోట్ అవుద్ది అనుకునేలా మైండ్ సెట్ చేసారు. కొత్తగా వచ్చేవాళ్లకు నేను ఒకటే చెప్తున్నాను. సెలబ్రిటిని తెచ్చే బదులు సినిమాని మార్కెటింగ్ చేసుకోండి. వాళ్ళు ఎవరూ రారు. నేను ఈ సినిమాకు చాలా మంది సెలబ్రిటీస్ ని అడుక్కున్నాను. నా సినిమాకు వచ్చి సపోర్ట్ చేయండి అని కాని రారు. మన సినిమాని తీసుకెళ్లేది డిస్ట్రిబ్యూటర్స్, సెలబ్రిటీలు కాదు. సెలబ్రిటీల వెనక తిరగకండి అంటూ సెలబ్రిటీల మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

ఇక జితేందర్ రెడ్డి సినిమాకు వచ్చిన కష్టాల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి వాయిదా పడుతూ వస్తుంది. సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ తర్వాత బ్యాన్ చేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. కొత్త ప్రొడ్యూసర్స్ కష్టపడి సినిమా చేస్తే చాలా ఇబ్బందులు. ఒక మంచి లీడర్ సినిమా చేస్తే రిలీజ్ చేసుకోవద్దా. జితేందర్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఈ సినిమాని తీసుకెళ్తారు అని అన్నారు.

ఒక హీరో ఇలా సినిమా ఈవెంట్లో ఈ రేంజ్ లో, అది కూడా సెలబ్రిటీల మీద ఫైర్ అవ్వడంతో టాలీవుడ్ లో రాకేష్ వర్రే స్పీచ్ చర్చగా మారింది. మరి దీనిపై సినీ పరిశ్రమ వ్యక్తులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.