Sasivadane Trailer: ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే.. ఆకట్టుకుంటున్న “శశివదనే” ట్రైలర్

యంగ్ హీరో రక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్‌ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ "శశివదనే" (Sasivadane Trailer). కొత్త దర్శకుడు సాయిమోహన్‌ ఉబ్బన తెరకెక్కిస్తున్న ఈ సినిమా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.

Sasivadane Trailer: ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే.. ఆకట్టుకుంటున్న “శశివదనే” ట్రైలర్

Rakshit and Komali 's Sasivadane Trailer released

Updated On : September 29, 2025 / 11:11 AM IST

Sasivadane Trailer: యంగ్ హీరో రక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్‌ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ “శశివదనే” (Sasivadane Trailer). కొత్త దర్శకుడు సాయిమోహన్‌ ఉబ్బన తెరకెక్కిస్తున్న ఈ సినిమా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ అందమైన ప్రేమకథ చిత్రం అక్టోబర్‌ 10న ప్రేక్షకుల రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా శశివదనే సినిమా ట్రైలర్‌ ను విడుదల చేశారు మేకర్స్. ‘ఒక్క చూపుతో ప్రేమ మొదలైందంటూ..’ హీరో చెప్పిన డైలాగు తో ట్రైలర్ మొదలయ్యింది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్ ఇలా ప్రతీ ఎలిమెంట్స్ ని ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి అక్టోబర్ 10న రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి. అంతకుముందు మీరు ఈ ట్రైలర్ చూసేయండి.

Pawan kalyan-Team India: ఇది దసరా బహుమతి.. దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది.. టీం ఇండియాకు పవన్ శుబాకాంక్షలు