Drugs case Bollywood : రియాతో రిలేషన్ రకుల్ మెడకు చుట్టుకుందా?

  • Published By: sekhar ,Published On : September 12, 2020 / 03:39 PM IST
Drugs case Bollywood : రియాతో రిలేషన్ రకుల్ మెడకు చుట్టుకుందా?

Updated On : September 12, 2020 / 4:22 PM IST

Rakul Preet Singh in Bollywood Drugs case: బాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసు హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ మెడకు చుట్టుకుంటుందా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.. నార్కోటిక్స్ బ్యూరో విచారణలో హీరోయిన్ రియా, రకుల్ ప్రీత్ సింగ్ పేరు బైటపెట్టినప్పట్నుంచీ కలకలం రేగుతోంది.. ఐతే దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ నుంచి ఎలాంటి స్పందనా కన్పించలేదు..


మరోవైపు తెలుగు ఇండస్ట్రీలోనూ గతంలో డ్రగ్స్ కేసు విషయమై పెద్ద సంచలనమే రేగింది.. ఇప్పుడు తిరిగి బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింక్ బైటపడటం హాట్ టాపిక్‌గా మారింది.. రియా, రకుల్ ప్రీత్ సింగ్ పేరు బైటపెట్టడంతో.. ఇక టాలీవుడ్‌లోనూ ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి…



https://10tv.in/sushant-case-riyas-brother-arrested-ncb-raids/
రియా చక్రవర్తి దాదాపు పాతికమంది పేర్లు చెప్పినట్లు తెలియగా.. అందులో నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉండటంతో.. ఇక టాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా పాత్రపై మరోసారి చర్చ జరుగుతోంది.. ఓ వైపు రకుల్ ప్రీత్ సింగ్ విషయమే తీసుకుంటే ఆమె బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన విషయం విదితమే..


హైదరాబాద్‌లో ఎఫ్ 45 పేరుతో ఫిట్‌నెస్ ఫ్రాంచైజీ కూడా రన్ చేస్తోంది.. ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్న రకుల్ పేరు ఇప్పుడు డ్రగ్స్ కేసులో బైటపడటం కలకలం రేపుతుంది.. దీనిపై ఇంతవరకూ అటు అధికారుల నుంచి కానీ.. ఇటు రకుల్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన కానీ.. వివరణ కానీ రాలేదు.


రకుల్ దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్నా కూడా ముంబైలోనూ తన రిలేషన్స్ కొనసాగిస్తోంది.. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తితో క్లోజ్ లేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.. సుశాంత్ డెత్ కేసులో రియా చక్రవర్తిని నిందితురాలిగా పేర్కొన్న సమయంలోనూ ఆమెకి అండగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా సందర్భాల్లో మాట్లాడింది.. ట్వీట్లు కూడా చేసింది..


ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ సేవించినట్లు రియా చక్రవర్తి స్వయంగా ఒప్పుకోవడంతో పాటు.. ఇంకా ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారనే అంశం నార్కోటిక్స్ వింగ్ ఎదుట పెట్టగా.. వారిలో రకుల్ ప్రీత్ పేరు బైటికి వచ్చింది.. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కనుక కేసులో చిక్కుకుపోతే.. ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలపై కూడా ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉంది..