Rakul Preet Singh: గడ్డ కట్టే చలిలో రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసిందో తెలుసా..?
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ బికినీలో గడ్డ కట్టే మంచులో చేసిన సాహసం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Rakul Preet Singh Baths In Freezing Water
Rakul Preet Singh: స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో చేసే అందాల విందు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించి రెట్టింపు స్థాయిలో గ్లామర్ షో చేస్తోంది. అయితే రియల్ లైఫ్‌లో అడ్వెంచర్స్ చేయడం రకుల్‌కు చాలా ఇష్టం. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
Rakul Preet Singh : బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ రకుల్ ప్రీత్..
గడ్డ కట్టే మంచులో రకుల్ చేసిన ఈ ఫీట్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో రకుల్ ఏకంగా బికినీలో గడ్డ కట్టే నీటిలో ఐస్ బాత్ చేసింది. బ్లూ బికినీలో రకుల్ చేసిన ఈ సాహసాన్ని ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక -15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలంట ఎంతో ధైర్యం ఉండాలని ఆమె అభిమానులు చెబుతున్నారు. కాగా, రకుల్ చేసిన ఈ సాహసం నిజంగా అభినందనీయం అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సరికొత్త యాడ్.. ఆ స్టార్ హీరో భామల సరసన..
ఇటీవల మరో స్టార్ బ్యూటీ సమంత కూడా ఐస్ బాత్ చేస్తూ దర్శనమివ్వడంతో హీరోయిన్లు ఇలా వరుసగా సాహసం చేస్తుండటం వారి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే, టాలీవుడ్‌లో తక్కువ ఆఫర్స్ వస్తున్నా, కోలీవుడ్, బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి.
View this post on Instagram