Rakul Preet Singh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన రకుల్..

సౌత్ లో ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ కి చెక్కేసి, అక్కడ వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి ఖాతాలో ఇప్పుడు అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్ నటించిన "డాక్టర్-జి" సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమైంది.

Rakul Preet Singh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన రకుల్..

Rakul Preet Singh Gives Clarity on Marriage Rumours

Updated On : October 13, 2022 / 1:24 PM IST

Rakul Preet Singh: సౌత్ లో ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ కి చెక్కేసి, అక్కడ వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి ఖాతాలో ఇప్పుడు అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్ నటించిన “డాక్టర్-జి” సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమైంది.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ బర్త్‌డే సెలబ్రేషన్స్..

ఇక బాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ, రకుల్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా, ఒక ప్రముఖ వెబ్ సైట్.. “వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు, ఈ విషయాన్ని రకుల్ బ్రదర్ అమన్ ప్రీత్ ప్రకటించినట్లు ప్రచురించింది. దీనికి రకుల్ ట్విట్టర్ వేదికగా దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది.

“నువ్వు నిజంగా చెప్పవా అమన్. నా పెళ్లి ఎప్పుడో నాకు కూడా చెప్పలేదే బ్రదర్. నా లైఫ్ గురించి మీకు ఎటువంటి వార్తలు దొరక్క, ఇలాంటి వాటిని రాస్తున్న మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది” అంటూ ట్వీట్ చేసింది రకుల్. కాగా సౌత్ లో ఈ హీరోయిన్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాలో నటిస్తుంది.