Ram Charan : కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్.. రామ్ చరణ్ ని సన్మానించిన అమిత్ షా..

తాజాగా చరణ్ ఆ ప్రోగ్రాం అయిపోయాక కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ అమిత షాని కలిశారు. ఇటీవల RRR మూవీ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో అమిత షా..................

Ram Charan : కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్.. రామ్ చరణ్ ని సన్మానించిన అమిత్ షా..

Ram Charan and Chiranjeevi meets Amit Shah in Delhi

Updated On : March 18, 2023 / 1:53 PM IST

Ram Charan :  RRR సినిమా నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నింగ్ తర్వాత చరణ్, ఉపాసన నేడు ఉదయం ఇండియాకు తిరిగి వచ్చారు. ఢిల్లీలో నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో చరణ్ పాల్గొనబోతుండటంతో డైరెక్ట్ ఢిల్లీకే వెళ్ళాడు చరణ్. ఇవాళ మధ్యాహ్నం ఆ కార్యక్రమంలో మాట్లాడి అనేక విషయాలు మీడియాతో పంచుకున్నాడు. చరణ్ కి ఢిల్లీలో భారీగా స్వాగతం లభించింది.

Ram Charan and Chiranjeevi meets Amit Shah in Delhi

తాజాగా చరణ్ ఆ ప్రోగ్రాం అయిపోయాక కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ అమిత్ షాని కలిశారు. ఇటీవల RRR మూవీ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో అమిత్ షా చరణ్ కు శాలువా కప్పి సన్మానించారు. అయితే చరణ్, చిరంజీవి కలిసి అమిత్ షాను కలవడంతో ఇటు సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లో కూడా చర్చగా మారింది. దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో అమిత్ షాని కలిసిన ఫోటోలని షేర్ చేస్తూ.. థ్యాంక్యూ అమిత్ షాజీ RRR టీం తరపున చరణ్ ని సన్మానించి ఆశీర్వదించినందుకు అంటూ పోస్ట్ చేశారు.

NTR : ఆస్కార్ తర్వాత మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్.. ఆస్కార్ విన్నింగ్ పై ఏం మాట్లాడాడో తెలుసా?

ఇక నేడు రాత్రికి చరణ్ హైదరాబాద్ కి రానున్నాడు. ఢిల్లీలో ఫ్లైట్ లో చరణ్, ఉపాసన, చిరంజీవి కలిసి హైదరాబాద్ కి బయలుదేరినట్టు సమాచారం. నేడు రాత్రికి హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి రానుండటంతో అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు అభిమానులు.

Ram Charan and Chiranjeevi meets Amit Shah in Delhi