NTR : ఆస్కార్ తర్వాత మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్.. ఆస్కార్ విన్నింగ్ పై ఏం మాట్లాడాడో తెలుసా?

ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ మొదటిసారి మీడియా ముందుకి రావడంతో ఎన్టీఆర్ ఆస్కారం విన్నింగ్ గురించి ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అంతా ఎదురుచూశారు. ఇక దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆస్కార్ విన్నింగ్ గురించి మాట్లాడుతూ..................

NTR : ఆస్కార్ తర్వాత మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్.. ఆస్కార్ విన్నింగ్ పై ఏం మాట్లాడాడో తెలుసా?

NTR Speech first time before media after winning oscar

NTR :  యువ హీరో విశ్వక్సేన్ దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఆస్కార్ గెలిచాక మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్ రావడంతో అభిమానులు భారీగా ఈవెంట్ కి తరలివచ్చారు. ఎన్టీఆర్ రాకతో దాస్ కా ధమ్కీ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Vishwaksen : నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు.. నేను ఏడవాలని అనుకుంటున్నారు..

ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ మొదటిసారి మీడియా ముందుకి రావడంతో ఎన్టీఆర్ ఆస్కారం విన్నింగ్ గురించి ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అంతా ఎదురుచూశారు. ఇక దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆస్కార్ విన్నింగ్ గురించి మాట్లాడుతూ.. ఇవాళ RRR ప్రపంచం అంతా నిలబడింది అంటే, ఆస్కార్ దక్కించుకుంది అంటే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వారితో పాటు తెలుగు చలన చిత్రసీమ, భారత చిత్రసీమ, భారతదేశపు ప్రేక్షకులు కూడా అంతే కారణం. కీరవాణి, చంద్రబోస్ గారిని ఆ స్టేజి మీద చూస్తుంటే నాకు వాళ్ళు కనపడలేదు. ఇద్దరు భారతీయులు, ఇద్దరు తెలుగు వాళ్ళు కనపడ్డారు. నేను లైవ్ లో చూశాను, ఆ మూమెంట్ ఎప్పటికి గుర్తుండిపోద్ది. RRR సినిమా ఇచ్చిన స్పూర్తితో తెలుగు సినిమాలు మరింత ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో తెలుగు సినిమాలు మరిన్ని విజయాలు సాధించాలి అని అన్నారు.