Ram Charan : సుకుమార్ కూతురుతో రామ్ చరణ్.. ఉపాసనతో కలిసి.. ఆ సినిమా కోసం..

తాజాగా రామ్ చరణ్ సుకుమార్ కూతురును సుకృతిని కలిసాడు.

Ram Charan : సుకుమార్ కూతురుతో రామ్ చరణ్.. ఉపాసనతో కలిసి.. ఆ సినిమా కోసం..

Ram Charan and Upasana Meets Sukumar Daughter Sukriti Veni and Appreciates Gandhi Tatha Chettu Movie Team

Updated On : January 25, 2025 / 3:27 PM IST

Ram Charan : రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం చరణ్ RC16 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ సుకుమార్ కూతురును సుకృతిని కలిసాడు. సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్ లో గాంధీ తాత చెట్టు అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా నిన్న జనవరి 24న రిలీజయింది.

తాజాగా ఈ సినిమాని రామ్ చరణ్ చూసి నచ్చడంతో మూవీ యూనిట్ అందర్నీ ఇంటికి పిలిచి అభినందించారు. సుకుమార్ కూతురు సుకృతి వేణి, దర్శకురాలు పద్మావతి మల్లాది, నిర్మాత శేష సింధు, ఈ సినిమాలో సుకృతితో పాటు నటించిన ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు కూడా చరణ్, ఉపాసనలను కలిశారు. చరణ్ – ఉపాసన ఈ మూవీ టీమ్ ని అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Madha Gaja Raja : విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్ వ‌చ్చేసింది.. సంతానం కామెడీ అదుర్స్‌..

Ram Charan and Upasana Meets Sukumar Daughter Sukriti Veni and Appreciates Gandhi Tatha Chettu Movie Team
డైరెక్టర్ సుకుమార్(Sukumar) కూతురు సుకృతి వేణి ముఖ్య పాత్ర‌లో న‌టించిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ బ్యానర్స్ పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావు నిర్మాణంలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. సుకుమార్‌ భార్య తబితా సుకుమార్ ఈ సినిమాని ప్రజెంట్ చేసింది. రిలీజ్ కి ముందే ఈ సినిమా దేశ విదేశాల్లో పలు అవార్డులు సాధించింది. ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది ఈ సినిమా.

ఓ పల్లెటూరులో కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని వస్తే తన ఊరిని, తన తాత ఎంతో ప్రేమించే చెట్టుని కాపాడుకోవడానికి గాంధీ మార్గాన్ని అనుసరించే ఓ 13 ఏళ్ళ అమ్మాయి అహింసావాదంతో ఏం చేసింది, ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో మంచి మెసేజ్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో సుకృతి తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది. ఈ సినిమా కోసం నిజంగా గుండు కొట్టించుకుంది సుకృతి. ఇక చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ అయిపోయింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ శివన్న కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read : Dil Raju : ఐటీ సోదాల‌పై స్పందించిన‌ దిల్‌ రాజు..