Dil Raju : ఐటీ సోదాలపై స్పందించిన దిల్ రాజు..
ఐటీ దాడులపై ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు.

Telugu Producer Dil Raju Press Meet Over IT Raids on him
ఐటీ దాడులపై ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు సర్వసాధారణం అని చెప్పారు. తాను సెలబ్రిటీని కాబట్టే మీడియా అంతా తనపై ఫోకస్ పెట్టిందన్నారు. తమపై మాత్రమే కాదని, ఇండస్ట్రీ మొత్తం ఐటీ దాడులు జరిగాయన్నారు.
గత నాలుగు రోజులు తన నివాసం, కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాలను ఉద్దేశించి దిల్ రాజు మాట్లాడారు. ‘గత నాలుగు రోజులుగా మా నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో మా వద్ద డబ్బు, డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారు. కానీ నా వద్ద రూ.5లక్షలు, శిరీశ్ వద్ద్ రూ.4.5 లక్షలు, నా కుమారై వద్ద ఆరున్నర లక్షలు, ఆఫీస్‌లో రెండున్నర లక్షలు ఇలా మొత్తం రూ.20లక్షల కంటే తక్కువ డబ్బే ఉంది. అది కూడా అనధికార డబ్బు కాదు. వాటికి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు. 24 క్రాప్ట్స్‌లో లావాదేవీలపై డిటైల్స్ అడిగారు. మేము ఇచ్చాము. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లన్లు చెక్ చేశారు. మా పారదర్శకత చూసి ఐటీ వాళ్లే ఆశ్చర్యపోయారు.’ అని దిల్‌రాజు అన్నారు.
Madha Gaja Raja : విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. సంతానం కామెడీ అదుర్స్..
ఇక దిల్ రాజు అమ్మగారికి గుండెపోటు వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపైనా దిల్‌రాజు స్పందించారు. మా అమ్మకి లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చికిత్స తీసుకున్నారు. అసత్య ప్రసారాలను మానుకోవాలని ఆయన సూచించారు.
ఇక తనను ఎవరూ టార్గెట్ చేయలేదన్నారు. 2008లో ఒకసారి ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. దాదాపు 16 ఏళ్ల తరువాత ఇప్పుడు ఈ దాడులు జరిగాయన్నారు. మధ్యలో మూడు సార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారన్నారు.
ఇక ఫేక్ కలెక్షన్స్ వల్లే ఐటీ సోదాలు జరుగుతున్నాయని వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. దానిపై ఇండస్ట్రీలో అందరం కలిసి కూర్చోని మాట్లాడుతామని చెప్పారు. తాను ఒక్కడినే వ్యక్తిగతంగా దీనిపై కామెంట్ చేయనని చెప్పారు. ఒకవేళ అలాంటి ఏదైనా ఉంటే తప్పకుండా ఇండస్ట్రీ తరుపున సరిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అంతా ఆన్‌లైన్ బుకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇక బ్లాక్ మనీ సమస్య లేదు అని దిల్‌రాజు చెప్పారు.