Ram Charan : కొత్త టాలెంటుని ఎంకరేజ్ చేయడానికి.. మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పలు సినిమాలు నిర్మించారు. త్వరలో ఈ ప్రొడక్షన్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించబోతున్నారు. తాజాగా రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారభించబోతున్నట్టు సమాచారం.

Ram Charan : కొత్త టాలెంటుని ఎంకరేజ్ చేయడానికి.. మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్న రామ్ చరణ్

Ram Charan and UV Creations Vikram starts new Production Hose V Mega Pictures

Updated On : May 25, 2023 / 5:06 PM IST

Ram Charan- V Mega Pictures :  మన హీరోలు నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొంత మంది కథానాయకులు కొత్తవాళ్లను, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సొంత నిర్మాణ సంస్థలు ఏర్పరుచుకొని సినిమాలు నిర్మిస్తున్నారు. కొంతమంది బయటి సినిమాలు నిర్మిస్తే, కొంతమంది సొంత సినిమాలు నిర్మించుకుంటున్నారు.

ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్ తో పలు సినిమాలు నిర్మించారు. త్వరలో ఈ ప్రొడక్షన్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించబోతున్నారు. తాజాగా రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారభించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ లో పార్ట్నర్, తన చిన్ననాటి స్నేహితుడు అయిన విక్రమ్ తో కలిసి రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.

Sudhakar : కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.. తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇస్తూ..

వి మెగా పిక్చర్స్ లో కొత్త టాలెంట్ కి అవకాశాలు ఇవ్వడానికి, కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు తెరకెక్కిస్తామని, చిన్న సినిమాలు కూడా ఈసంస్థలో నిర్మిస్తామని మీడియా ప్రకటనలో తెలిపారు చరణ్, విక్రమ్. మరి ఈ నిర్మాణ సంస్థలో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.