Ram Charan : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళం

తెలుగు రాష్ట్రాల్లోని వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముందుకు వ‌చ్చారు.

Ram Charan : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళం

Ram Charan announced one crore for telugu states

Updated On : September 4, 2024 / 6:29 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముందుకు వ‌చ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. తెలంగాణ‌కు రూ.50ల‌క్ష‌లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.50ల‌క్ష‌లు చొప్పున మొత్తం కోటి రూపాయ‌ల‌ను విరాళంగా అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన స‌మ‌యం అని అన్నారు.

“వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని ఎక్స్‌లో రామ్‌చ‌ర‌ణ్ పోస్ట్ చేశారు.

Akkineni Family : వరద బాధితులకు భారీ విరాళం ప్ర‌క‌టించిన అక్కినేని కుటుంబం.. ఎంతంటే?

ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. ప్ర‌భాస్ రూ.రెండు కోట్లు, చిరంజీవి రూ.కోటి, బాలకృష్ణ రూ.కోటి, అల్లు అర్జున్ రూ.కోటీ, మహేశ్‌బాబు రూ.కోటి, ఎన్టీఆర్‌ రూ.కోటి, సిద్ధూ జొన్నల గడ్డ రూ.30 లక్షలు, విష్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, అనన్య నాగళ్ల రూ.2.5లక్షలు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కూడా.

Megha Akash : శ్రీలంకలో హీరోయిన్ మేఘ ఆకాష్ బ్యాచిలర్ పార్టీ సెలబ్రేషన్స్..