Ram Charan: చిరు సినీ ప్రస్థానం.. చెర్రీ ఎమోషనల్ ట్వీట్
పునాది రాళ్లు నుండి గాడ్ ఫాదర్ వరకు చిరంజీవి సినీ ప్రస్థానం తెరిచిన పుస్తకమే. ఆయన కష్టం.. సినిమా కోసం పడిన తపన అంతా ఏదో ఒక రకంగా సగటు సినీ ప్రేక్షకుడికి తెలిసిందే..

Ram Charan
Ram Charan: పునాది రాళ్లు నుండి గాడ్ ఫాదర్ వరకు చిరంజీవి సినీ ప్రస్థానం తెరిచిన పుస్తకమే. ఆయన కష్టం.. సినిమా కోసం పడిన తపన అంతా ఏదో ఒక రకంగా సగటు సినీ ప్రేక్షకుడికి తెలిసిందే. కొణిదెల శివ శంకర వరప్రసాద్ గా నెగటివ్ పాత్రలతో మొదలైన ఆయన సినిమా ప్రయాణం చిరంజీవిగా మలుపు తిరిగి ప్రపంచం గుర్తుపట్టే స్థాయికి ఎదిరిగింది. ఆగస్ట్ 22న జన్మించిన చిరు సెప్టెంబర్ 22న నటుడిగా ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. చిరు నటించిన తొలి సినిమా ‘పునాది రాళ్లు’ కాగా ‘ప్రాణం ఖరీదు’ 1978 సెప్టెంబరు 22న విడుదలైంది.
Ariyana Glory: బోల్డ్ బ్యూటీ అరియానా.. సన్నని అందాలు చూడతరమా..!
అంటే, ఈ సెప్టెంబర్ 22 (బుధవారానికి) చిరు సినీ ప్రస్థానానికి 43 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవి.. తనపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తోన్న అభిమానులకి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఆగస్టు 22 నేను పుట్టిన రోజైతే, సెప్టెంబరు 22.. నటుడిగా పుట్టినరోజు. కళామ్మతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. నటుడిగా పరిచయమై మీ అందరి ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేనిరోజు. దీనికి కారణమైన నా సోదరసోదరీమణులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Shalini Pandey: సెగలు పుట్టిస్తున్న షాలినీ పాండే హాట్ అవతారం
చిరు వారసుడిగా తెలుగు సినిమా ప్రపంచంలో అడుగుపెట్టిన తనయుడు రామ్ చరణ్ తండ్రి చిరు సినీ ప్రస్థానంపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఓ ఎమోషన్ పోస్ట్ పెట్టాడు. ’43 ఏళ్ల సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది.. మా నాన్న’ అంటూ తన తండ్రి మొదటి సినిమా నాటి ఫోటో ఇప్పుడు చేస్తున్న ఆచార్య సినిమా ఫోటోని జత చేసి షేర్ చేశారు. బుధవారం చిరు చేసిన పోస్టును అభిమానులు తెగ షేర్ కొట్టి వైరల్ చేయగా ప్రస్తుతం రామ్ చరణ్ పోస్ట్ కూడా అంతేగా వైరల్‌గా మారింది.
43 years and still counting!
My Appa @KChiruTweets ❤️ pic.twitter.com/2th29femzz— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2021