RRR : సీతారామరాజు వేషధారణతో చెర్రీ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ
స్టార్ హీరోల సినిమాలు అంటే అభిమానుల హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లని అభిమానులు ముస్తాబు చేస్తున్నారు. తమ అభిమాన హీరోల కటౌట్స్, బ్యానర్స్ కట్టి.........

Ram Charan (1)
Ram Charan : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దేశ వ్యాప్తంగా నేడు మార్చ్ 25న ఈ సినిమా భారీగా రిలీజ్ అయింది. ప్రస్తుతం దేశం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ మానియా నడుస్తుంది. ప్రేక్షకులు, అభిమానులు, సెలబ్రిటీలు అంతా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల సినిమా చూసి అదిరిపోయింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
స్టార్ హీరోల సినిమాలు అంటే అభిమానుల హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లని అభిమానులు ముస్తాబు చేస్తున్నారు. తమ అభిమాన హీరోల కటౌట్స్, బ్యానర్స్ కట్టి హంగామా చేశారు. నిన్న రాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానులు కోలాహలం చేస్తున్నారు. కొత్త కొత్తగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు అభిమానులు.
RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..
రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండటంతో తాజాగా రామ్ చరణ్ అభిమానులు హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు గెటప్స్‌తో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 100 మంది చెర్రీ అభిమానులు సీతారామరాజు గెటప్స్ వేసుకొని రామ్ చరణ్ జెండాలు పట్టుకొని బైక్ మీద ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.