Game Changer : రామ్ చరణ్ అభిమానులకు నిరాశే.. ‘జరగండి..’ దీపావళికి కూడా రావట్లేదు.. అధికారికంగా క్లారిటీ..

ఇటీవల ఈ మూవీ నుంచి ‘జరగండి..’(Jaragandi) అనే ఓ సాంగ్ లీక్ అవ్వడంతో అది వైరల్ అయింది. చిత్రయూనిట్ సాంగ్ లీక్ చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయించింది. దానిని అఫీషియల్ గా దీపావళికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Game Changer : రామ్ చరణ్ అభిమానులకు నిరాశే.. ‘జరగండి..’ దీపావళికి కూడా రావట్లేదు.. అధికారికంగా క్లారిటీ..

Ram Charan Game Changer Jaragandi Song Postponed Movie Unit announced Officially

Updated On : November 11, 2023 / 12:33 PM IST

Game Changer Update : రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ అనేక కారణాలు వల్ల లేట్ అవుతూ వస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు గడిచి పోయింది. కానీ మూవీ మాత్రం ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మూవీ నుంచి ఒక పోస్టర్, టైటిల్ తప్ప మరే అప్డేట్ లేదు.

మధ్య మధ్యలో అత్యుత్సాహంతో వచ్చిన కొన్ని లీక్స్ తప్పితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, చిత్రయూనిట్ కూడా సరిగ్గా స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. చిత్రయూనిట్ ని సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తున్నారు.

ఇక ఇటీవల ఈ మూవీ నుంచి ‘జరగండి..’(Jaragandi) అనే ఓ సాంగ్ లీక్ అవ్వడంతో అది వైరల్ అయింది. చిత్రయూనిట్ సాంగ్ లీక్ చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయించింది. దానిని అఫీషియల్ గా దీపావళికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ మళ్ళీ అప్పట్నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. గత కొన్ని రోజులుగా ‘జరగండి..’ సాంగ్ రిలీజ్ పోస్టుపోన్ అవుతుందని వార్తలు వచ్చాయి.

Also Read : Chandra Mohan : తెలుగు సినిమాల్లో నాన్న పాత్రలంటే ఆయనే చేయాలి.. ఆ సినిమాలో అయితే జీవించేశారు..

తాజాగా అదే నిజమైంది. చిత్ర యూనిట్ అధికారికంగా.. జరగండి సాంగ్ దీపావళికి రిలీజ్ చెయ్యట్లేదు అని, ఆడియో డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చాయని, ప్రస్తుతానికి వాయిదా వేసి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలుపుతూ ఓ లెటర్ రిలీజ్ చేశారు. అలాగే గేమ్ ఛేంజర్ సినిమా అభిమానులని మెప్పిస్తుందని, సినిమా కోసం చాలా మంది వర్క్ చేస్తున్నారని, మీకు బెస్ట్ ఇస్తామని తెలిపింది. దీంతో మరోసారి చరణ్ అభిమానులు నిరాశ చెందుతూ చిత్రయూనిట్ ని తిడుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందో, అప్డేట్ ఎప్పుడు వస్తుందో, అసలు సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.