Ram Charan: న్యూజిలాండ్ లో ఆడిపాడబోతున్న రామ్‌చరణ్..

రామ్‌చరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమాతో ఇండియా వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇమేజ్ ని కాపాడుకునేలా తన తదుపరి సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తుండగా...

Ram Charan: న్యూజిలాండ్ లో ఆడిపాడబోతున్న రామ్‌చరణ్..

Ram Charan goes to New Zealand for his Next schedule of RC15

Updated On : October 24, 2022 / 4:57 PM IST

Ram Charan: రామ్‌చరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమాతో ఇండియా వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇమేజ్ ని కాపాడుకునేలా తన తదుపరి సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తుండగా, వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్నాడు.

Ram Charan: జపాన్ లో చరణ్ చాక్లెట్స్.. తన పేరుతో చాక్లెట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయిన రామ్‌చరణ్..

ఇటీవల రాజమండ్రిలో ఒక ముఖ్యమైన షెడ్యూల్ పూర్తీ చేసుకున్న మూవీ టీం, తరువాతి షెడ్యూల్ ని న్యూజిలాండ్ లో ప్లాన్ చేసిందట. ఈ చిత్రంలో చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుండగా.. న్యూజిలాండ్ లోని అందమైన ప్రదేశాల్లో వీరిద్దరిపై ఒక రొమాంటిక్ సాంగ్ ని డైరెక్టర్ శంకర్ చిత్రీకరించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రామ్‌చరణ్ జపాన్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. జపాన్ నుంచి రాగానే చరణ్ న్యూజిలాండ్ కు పయనమవనున్నాడని తెలుస్తుంది. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “అధికారి” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడట.