RC 15 : వైజాగ్లో రామ్ చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు…
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు షెడ్యూళ్ళని..........

Charan
Ram Charan : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు షెడ్యూళ్ళని పూర్తి చేసుకుంది ఈ సినిమా. ముంబై, పూణే, రాజమండ్రి, పంజాబ్ లో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకోగా ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుగుతుంది. వైజాగ్ లోని మధురవాడ, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుగుతుంది.
Priyanka Chopra : మదర్స్ డే రోజూ కూతుర్ని పరిచయం చేసిన ప్రియాంక చోప్రా
అయితే ఆదివారం మధురవాడలో షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ అక్కడికి వచ్చాడని తెలిసి అభిమానులు, చుట్టుపక్కల జనాలు షూటింగ్ వద్దకి భారీ సంఖ్యలో వచ్చారు. రామ్ చరణ్ వారందరిని ఉద్దేశించి కాసేపు మాట్లాడారు. ఆతర్వాత వెళ్ళేటప్పుడు అభిమానులు రామ్ చరణ్ తో ఫోటోల కోసం ఎగబడ్డారు. దీంతో బౌన్సర్లు చరణ్ ని అక్కడ్నుంచి జాగ్రత్తగా తరలించారు.