Game Changer : రామ్ చరణ్ బ్యాక్ టు షూట్..! గేమ్ చెంజర్ కొత్త షెడ్యూల్ షురూ..

రామ్ చరణ్ గేమ్ చెంజర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన చరణ్ ఇప్పుడు బ్యాక్ టు షూట్..

Game Changer : రామ్ చరణ్ బ్యాక్ టు షూట్..! గేమ్ చెంజర్ కొత్త షెడ్యూల్ షురూ..

Ram Charan Kiara Advani Game Changer new scheduel details

Updated On : July 10, 2023 / 4:41 PM IST

Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ చెంజర్’. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 (Indian 2) కూడా తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది.

Kushi : ఖుషి సెకండ్ సింగల్ ప్రోమో రిలీజ్.. నాతో రా ‘ఆరాధ్య’..

ఇక ఇటీవల చరణ్ కి పాప పుట్టడంతో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. మెగా ప్రిన్సెస్ తో హ్యాపీ టైం స్పెండ్ చేసిన రామ్ చరణ్.. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు షూట్ అంటున్నాడు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ మంగళవారం (జులై 11) నుంచి మొదలు కానుందట. ఈ షెడ్యూల్ కి సంబంధించిన మేజర్ పార్ట్ హైదరాబాద్ లోనే చిత్రీకరించనున్నారు. భారీ యాక్షన్ సీన్ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నుంచి ఒక్క అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Guntur Karam : గుంటూరు కారం సినిమానే టార్గెట్ చేస్తున్నారు అందరూ.. ఎందుకో అర్ధం కావడం లేదు.. థమన్!


ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ లేదు. ఎప్పుడు రిలీజ్ అన్న విషయం కూడా క్లారిటీ లేదు. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్మాత దిల్ రాజు పై ట్విట్టర్ లో నెగటివ్ ట్రెండ్ చేశారు. మూవీ టీం నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాగా శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 రిలీజ్ డేట్ పై ఈ మూవీ రిలీజ్ డేట్ ఆధారపడి ఉందని తెలుస్తుంది. ఇండియన్ 2 విడుదల తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదు.