Ram Charan : ఇదేం యాడ్‌రా బాబు.. ఏజెంట్ లెవ‌ల్‌లో చ‌ర‌ణ్‌తో మీషో యాడ్

ఇటీవ‌ల కాలంలో బ‌డా కంపెనీలు యాడ్స్‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాయి. సెల‌బ్రెటీల‌తో యాడ్స్ చేయిస్తే త‌మ ఉత్ప‌త్తులు ఎక్కువ మంది వినియోగ‌దారుల‌కు చేరుకుంటాయ‌ని బావిస్తున్నాయి

Ram Charan : ఇదేం యాడ్‌రా బాబు.. ఏజెంట్ లెవ‌ల్‌లో చ‌ర‌ణ్‌తో మీషో యాడ్

Ram Charan Meesho Ad

Updated On : July 4, 2023 / 6:26 PM IST

Ram Charan Meesho Ad : ఇటీవ‌ల కాలంలో బ‌డా కంపెనీలు యాడ్స్‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాయి. సెల‌బ్రెటీల‌తో యాడ్స్ చేయిస్తే త‌మ ఉత్ప‌త్తులు ఎక్కువ మంది వినియోగ‌దారుల‌కు చేరుకుంటాయ‌ని బావిస్తున్నాయి. దీంతో ఎంత ఖ‌ర్చు అయినా స‌రే స్టార్స్ తో యాడ్స్ చేయించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఒక్కో బాష‌లో ఒక్కో స్టార్స్‌తో త‌మ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేయిస్తున్నాయి.

ప్ర‌ముఖ ఆన్‌లైన్ సేల్స్ యాప్ మీషో త‌న కొత్త యాడ్స్‌ను విడుద‌ల చేసింది. త‌మ‌ ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన ఈ యాడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) న‌టించగా హిందీలో ఇదే యాడ్‌లో ర‌ణ్‌వీర్ (Ranveer Singh)చేశాడు.

Samantha : సమంత ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌.. ‘చావు నుంచి మ‌న‌ల్నీ ఏదీ కాపాడ‌లేన‌ప్పుడు’.. మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా..?

 

View this post on Instagram

 

A post shared by Meesho @meeshoapp (@meeshoapp)

Vindu Dara Singh : మందు తాగి ఆదిపురుష్ సినిమా తీశారా? మా నాన్న పరువు తీశారు.. చిత్ర యూనిట్ పై ఫైర్ అయిన నటుడు..

యాడ్ ప్రారంభం కాగానే.. స‌ర్ టార్గెట్ ను చూశాను అని రామ్‌చ‌ర‌ణ్ అన‌గా వేరే ప్ర‌దేశంలో ఉన్న వ్య‌క్తి.. ఏజెంట్ అత‌ను ఏం వేసుకున్నాడు అని అడుగుతాడు. అత‌డిని ఫాలో అవుతూ.. బ్లూ జీన్స్ బ్లాక్ జాకెట్.. జాకెట్ ప్రీమియంగా ఉంది. సాఫ్ట్, కోజీగా ఉంది. అత‌డికి బాగా సూట్ అయ్యింది. అబ్బాయి కొంచెం సెక్సీగా ఉన్నాడు స‌ర్‌ అంటూ చ‌ర‌ణ్ అన్నాడు. ఫోక‌స్ చేయ్ జీన్స్ గురించి చెప్ప‌మ‌ని అడుగ‌గానే దానికి సంబంధించిన విష‌యాల‌ను చెబుతాడు. ధ‌ర ఎంతో తెలుసుకుని అడుగ‌గా.. అత‌డి ప‌ట్టుకుని ఎంత‌కు తీసుకున్నావ్ ఈ జాకెట్‌ను రూ.6వేల‌కా అని అడుగుతాడు. కాదు రూ.600 వంద‌ల‌కు అని అత‌డు చెబుతాడు. ఎక్క‌డి నుంచి అడుగ‌గా మీ షో నుంచి అని చెబుతాడు ఇలా యాడ్ కొన‌సాగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Meesho @meeshoapp (@meeshoapp)

Salaar : ప్ర‌భాస్ అభిమానుల‌కు సలార్ టీమ్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. మీ ద‌గ్గ‌ర ఆ టాలెంట్ ఉందా..? ఇదే మంచి అవ‌కాశం..