Samantha : సమంత ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌.. ‘చావు నుంచి మ‌న‌ల్నీ ఏదీ కాపాడ‌లేన‌ప్పుడు’.. మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా..?

స‌మంత‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది. ఆమె చేసే పోస్టులు కొన్నిసార్లు ఆలోచింప‌జేసే విధంగా ఉంటాయి. తాజాగా ఆమె చేసిన ఓ పోస్టు వైర‌ల్‌గా మారింది.

Samantha : సమంత ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌.. ‘చావు నుంచి మ‌న‌ల్నీ ఏదీ కాపాడ‌లేన‌ప్పుడు’.. మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా..?

Actress Samantha

Samantha Insta post :  ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయ చేసింది స‌మంత‌(Samantha). చాలా త‌క్కువ స‌మయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వ‌రుస సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో పుల్ బిజీగా ఉంది. కెరీర్ ప‌రంగా దూసుకువెలుతున్న‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అక్కినేని నాగ‌చైత‌న్య‌(Akkineni Naga Chaitanya )ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. కొన్నాళ్ల‌కు వీరిద్ద‌రు విడిపోయారు. ఆ త‌రువాత కొద్ది రోజుల‌కే తాను ‘మయోసైటిస్’ బారిన ప‌డిన‌ట్లు తెలిపింది.

ఈ వ్యాధి నుంచి కోలుకుంది. జీవితంలో ఎన్ని క‌ష్టాలు ఎదురైనా స‌రే ధైర్యంగా వాటిని ఎదుర్కొంది. వ్యాధి నుంచి కోలుకున్న త‌రువాత స‌మంత‌ ఆలోచ‌న విధానం చాలా మారిపోయింది. ఏదీ ఎలాగున్న‌ప్ప‌టికీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది. ఆమె చేసే పోస్టులు కొన్నిసార్లు ఆలోచింప‌జేసే విధంగా ఉంటాయి. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైర‌ల్‌గా మారింది.

Samantha : జీవితాంతం ప్రేమించే వ్య‌క్తి అత‌నే.. మంచి వ్య‌క్తికి వంద‌రెట్లు ఎక్కువ.. పిక్ షేర్ చేసిన స‌మంత

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స‌మంత ఓ పోస్ట్ చేసింది. ‘చావు నుంచి మ‌న్న‌ల్నీ ఏదీ కాపాడ‌లేదు. క‌నీసం ప్రేమ‌తో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి.’ అంటూ చిలీ ర‌చయిత ఫాబ్లో నెరుడా కోట్ చేసింది. ఇది నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. స‌మంత ఇప్పుడు ఎందుకు ఇలాంటి పోస్ట్ చేసింది. మళ్లీ గానీ ఆమె ప్రేమలో ప‌డేలేదు గ‌దా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటి అన్న‌ది ఆమె చెబితేనే గానీ తెలియ‌దు.

Samantha Insta post

Samantha Insta post

Bigg Boss OTT 2 : అతడే కాదు.. ఎవ‌రు ఉన్నా స‌రే లిప్‌లాక్ ఇచ్చేదాన్ని

ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. విజ‌య‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ‘ఖుషి’ సినిమాలో న‌టిస్తోంది. శివనిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలోని ‘నా రోజా నువ్వే’ పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ సామ్ న‌టిస్తోంది.