Ram Charan : రామ్ చరణ్ కూడా మనలాగానే.. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఆ పని చేస్తాడంటా.. అదేంటో తెలుసా..?

రామ్ చరణ్ మీషో ఆన్‌లైన్ షాపింగ్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చరణ్ కూడా మనలాగానే ఆన్‌లైన్ షాపింగ్‌ చేసేటప్పుడు ఆ పని చేస్తాడంటూ చెప్పుకొచ్చాడు.

Ram Charan : రామ్ చరణ్ కూడా మనలాగానే.. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఆ పని చేస్తాడంటా.. అదేంటో తెలుసా..?

Ram Charan said he also uses Low to High option in online shopping

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ మీషో (Meesho) కి తెలుగు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ కోసం చరణ్ చేస్తున్న యాడ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల స్పై థ్రిల్లర్ తరహాలో తెరక్కించిన ఒక యాడ్ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సంస్థ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చరణ్.. తన స్టైలింగ్ అండ్ షాపింగ్ విషయాలు గురించి అభిమానులకు తెలియజేశాడు.

Kanguva Glimpse : ‘కుశలమా’ అంటూ భయపెడుతున్న సూర్య.. కంగువ గ్లింప్స్‌ చూశారా..?

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ని ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారా..? అని ప్రశ్నించగా, చరణ్ బదులిస్తూ.. “తనకి చాలా బద్ధకం ఎక్కువని, అందుకనే షాప్ కి వెళ్లి కొనడం కంటే ఆన్‌లైన్ షాపింగ్ పై ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మనమందరం ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ముందుగా చేసే పని.. ధర తక్కువ నుంచి ఎక్కువ పెట్టడం (Price : Low to High option). ఈ పని మీరు కూడా చేస్తారా..? అని రామ్ చరణ్ ని ప్రశ్నించగా.. “నేను కూడా ముందు అదే పని చేస్తాను. కొంచెం మంచి కావాలంటే నాలుగోవ పేజీ వరకు వెళ్తాను గాను ఎప్పుడు హై టు లో ఆప్షన్ పెట్టి కొన్నది లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.ఈ మాటలు విన్న నెటిజెన్స్.. ‘రామ్ చరణ్ కూడా మనలాగానే’ అంటూ ఆ వీడియోని నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Nithiin 32 : నితిన్-వక్కంతం వంశీ సినిమా క్రేజీ అప్‌డేట్‌.. ఫ‌స్ట్ లుక్‌కు టైమ్ ఫిక్స్‌

ఇక రామ్ చరణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ ని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.