సల్లూభాయ్ కి చెర్రీ స్వాగతం

సల్మాన్ ఖాన్,సోనాక్షిసిన్హా కాంబినేషన్ లో దబాంగ్ 3మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 20న హిందీ,తమిళ్, తెలుగు,కన్నడ భాషలలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రభుదేవా డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో చుల్ బుల్ పాండేగా ప్రేక్షకులను సల్లూభాయ్ అలరించనున్నాడు.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..వెల్ కమ్ మై బ్లాక్ బస్టర్ ఫ్రెండ్ అంటూ సల్లూభాయ్ కి స్వాగతం పలుకుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. 100 డేస్ టూ దబంగ్ 3 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసి ఈ మూవీ తెలుగు వర్షెన్ మోషన్ పోస్టర్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా షేర్ చేశాడు. వీడియోలో సల్మాన్ .. ఆటకైన, వేటకైన రెడీ అని చెప్పే డైలాగ్ అభిమానులని అలరిస్తుంది. కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దబాంగ్ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో దబాంగ్ 3పై కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. సల్మాన్ చివరిగా భారత్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు.