Upasana: ప్రధాని మోడీతో ఉపాసన.. అసలు విషయం ఏమిటంటే?

ఉపాసన కామినేని.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పటిల్స్ చైర్ పర్సన్ గానే కాకుండా ఉపాసన అంతకు మించి మరెన్నో కార్యక్రమాలతో పేరు తెచ్చుకుంది.

Upasana: ప్రధాని మోడీతో ఉపాసన.. అసలు విషయం ఏమిటంటే?

Upasana

Updated On : December 23, 2021 / 1:12 PM IST

Upasana: ఉపాసన కామినేని.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పటిల్స్ చైర్ పర్సన్ గానే కాకుండా ఉపాసన అంతకు మించి మరెన్నో కార్యక్రమాలతో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా పర్యావరణ, జంతు ప్రేమికురాలిగా ఉపాసన చాలామందికి పరిచయమే. కాగా తాజాగా ఉపాసన దుబాయ్ 2020 ఎక్స్‌పోను సందర్శించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో భేటీ అయిన విశేషాలను ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని దుబాయ్‌ 2020 ఎక్స్‌పో వద్ద భేటీ అవ్వడం ఎంతో గౌరవప్రదంగా ఉందని పేర్కొన్నారు.

Bhala Thandanana: యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!

ఎన్నో రకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్ష, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి. చంద్రుని మీద దక్షిణ ధృవంపై నీరు ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు ఇండియానే మొట్టమొదటి సారిగా చంద్రయాన్ ప్రయోగం చేసిందని మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు ఈ ఎక్స్‌పో కార్యక్రమంలో ఉన్నాయి. మీ పిల్లలను ఈ ఎక్స్ పోకు తీసుకెళ్లాలని కోరుతూ ఉపాసన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?

అయితే, ఎక్స్ పో విశేషాలతో పాటు ప్రధాని మోడీతో ఉపాసన కూర్చున్న ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.. నిజంగానే ఉపాసన మోడీతో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా కొందరు పొరబడుతున్నారు. అయితే.. ఇది వాస్తవం కాదు. అగ్‌మెంటెడ్ రియాలిటీ అనే టెక్నాలజీ ద్వారా ఈ ఫోటోను సృష్టించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి దుబాయ్‌ 2020 ఎక్స్‌పోలో భారత పార్లమెంట్‌, ప్రధాని మోదీ ఉన్నట్లు ఆవిష్కరించి ఇలా షేర్ చేశారు. అయితే.. ఇది నిజమే అనుకున్న నెటిజన్లు ఈ ఫోటో, పోస్టును తెగ షేర్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)