Ram Charan – Balakrishna : బాలయ్యతో రామ్ చరణ్.. అన్‌స్టాపబుల్‌ లో ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ ఫిక్స్..?

ఇప్పటికే అన్‌స్టాపబుల్‌ పలు ఎపిసోడ్స్ ఆల్రెడీ షూటింగ్ అయ్యాయి.

Ram Charan will coming to Balakrishna Unstoppable Show for Game Changer Movie Promotions

Ram Charan – Balakrishna : బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్‌ షో మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకొని నేటి నుంచి నాలుగో సీజన్ మొదలు కానుంది. నేడు రాత్రి మొదటి ఎపిసోడ్ సీఎం చంద్రబాబు నాయుడుతో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు టీడీపీ కార్యకర్తలు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటికే అన్‌స్టాపబుల్‌ పలు ఎపిసోడ్స్ ఆల్రెడీ షూటింగ్ అయ్యాయి. నాగార్జున, అల్లు అర్జున్, సూర్య ఎపిసోడ్స్ షూటింగ్ అయినట్టు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ కూడా అన్‌స్టాపబుల్‌ షోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం అన్‌స్టాపబుల్‌ షూట్ కి రామ్ చరణ్ రానున్నట్టు సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్, దిల్ రాజు అన్‌స్టాపబుల్‌ షోకి వస్తున్నారట.

Also Read : Chiranjeevi – Nagarjuna : బాస్‌తో కింగ్ మీటింగ్.. చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం.. గ్రాండ్ ఈవెంట్‌కు ఆహ్వానం.. ఫొటోలు వైరల్..

ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాని సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్యతో – రామ్ చరణ్ ఎపిసోడ్ షూట్ చేసి సినిమా రిలీజ్ కి ముందు వదులుతారని తెలుస్తుంది. గతంలో ప్రభాస్ వచ్చినప్పుడు చరణ్ కి కాల్ చేసి బాలకృష్ణ మాట్లాడారు. బయట కూడా చరణ్ కి బాలయ్యతో మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో రామ్ చరణ్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్ కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.