Ram Gopal Varma : నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. ఎక్కడికి పారిపోలా : రామ్‌గోపాల్ వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

Ram Gopal Varma press meet about recent cases
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తన ఎక్స్ అకౌంట్ లో వేల పోస్టులు పెట్టానని చెప్పాడు. వాటిలో కొన్నింటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది తర్వాత స్పందించారని, తనపై కేసు పెట్టినట్లుగా తెలిపారు. సంవత్సరం తర్వాత నాలుగైదుగురు ఒకే సారి మేల్కొనడం ఏంటీ అని ప్రశ్నించారు. వివిధ జిల్లాల్లో తనపై కేసులు పెట్టారన్నారు.
నా పని వల్ల నేను హాజరుకాలేనని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నాను. నన్ను అరెస్టు చేస్తారని పోలీసులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు నా డెన్ కు వచ్చారు. నేను డెన్ లో లేకపోవడంతో పరారీలో ఉన్నాడని, మంచం కింద దాక్కున్నాడని మీడియా కథలు అల్లింది. నా అరెస్టు గురించి ఏ పోలీసు అధికారి చెప్పలేదు. న్యూస్ లేకపోతే న్యూస్ ను సృష్టిస్తున్నారు, నా విషయంలో అదే జరిగింది. సోషల్ మీడియాలో టూమచ్ చేయవద్దంటారు.
Pushpa 2 Security : హైదరాబాద్ పుష్ప 2 ఈవెంట్.. మొదటిసారి 1000 మంది పోలీసులతో భద్రత..
అది ఎలా చెబుతారు. ఒక కార్టూన్ పోస్టును అనే రకాల కోణల్లో ఆపాదించుకోవచ్చు. సోషల్ మీడియా కంటే డేంజర్ మేన్ స్ట్రీమింగ్ మీడియా తయారైంది. మేన్ స్ట్రీమింగ్ మీడియాకు లెక్చర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు . నన్ను కోడ్ చేస్తూ మేన్ స్ట్రీమింగ్ మీడియా కూడా పోస్టులు పెడుతుంది అని వర్మ అన్నారు.
తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని వర్మ చెప్పాడు. తనను నాగార్జున, ప్రకాశ్ రాజ్ దాచిపెట్టారని మీడియా అసత్య ప్రచారం చేసిందన్నారు. తన గురించి ఎన్నో రకాలుగా బూతులు తిడుతూ మీమ్స్ పెడతారన్నారు. అమెరికా లాంటి దేశం కూడా మీమ్స్ ను నియంత్రించలేకపోయిందన్నారు.
Pushpa Srivalli : పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా?