Kalki 2898 AD : క‌ల్కి ట్రైల‌ర్‌.. రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌జిల్‌.. గెలిస్తే అక్ష‌రాలా ల‌క్ష మీదే..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సైతం ఈ ట్రైల‌ర్ ను చూసి ఫిదా అయ్యాడు.

Kalki 2898 AD : క‌ల్కి ట్రైల‌ర్‌.. రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌జిల్‌.. గెలిస్తే అక్ష‌రాలా ల‌క్ష మీదే..

Ram Gopal Varma Puzzlela On Kalki Release Trailer

Kalki 2898 AD – RGV : ప్ర‌భాస్ న‌టించిన సినిమా కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు అభిమానులు, నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. విజువ‌ల్స్ గానీ, యాక్ష‌న్ సీక్వెన్స్ అన్నీ కూడా హాలీవుడ్ లెవ‌ల్‌లో ఉన్నాయ‌ని అంటున్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సైతం ఈ ట్రైల‌ర్ ను చూసి ఫిదా అయ్యాడు. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అంతేనా క‌ల్కి ట్రైల‌ర్‌ను ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌)లో షేర్ చేసి ఓ ప‌జిల్ ఇచ్చాడు. ఓ సెంటెన్స్ ఇచ్చి అందుకో కొన్ని లెట‌ర్స్‌ను మిస్ చేశాడు. ఈ ప‌జిల్‌ను ఎవ‌రైతే ముందుగా ఫిల్ చేస్తారో వాళ్ల‌కి అక్ష‌రాలా ల‌క్ష రూపాయ‌ల‌ను ఇస్తాన‌ని చెప్పాడు. ఆర్‌జీవీ చేసిన ఈ ట్విట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. మ‌రిఇంకెందుకు ఆల‌స్యం మీరు ఆ ప‌జిల్‌ను సాల్వ్ చేయ‌గ‌ల‌రేమో ఓ సారి చూడండి.

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి 2898 AD’లో మాళవిక నాయర్.. ట్రైల‌ర్ చూసేంత వ‌ర‌కు తెలియ‌దుగా..!

ఇక క‌ల్కి విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్ భామ దీపిక పదుకొణె క‌థానాయిక‌గా న‌టించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, మాళ‌విక నాయ‌ర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.