Ram-Lakshman : ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు
ఈవెంట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు పంచ కట్టుకొని సంప్రదాయంగా వచ్చారు. రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''మా లైఫ్ మొదలైందే అన్నయ్య సినిమాలు చూడటంతోనే. ఈ సినిమాలో.........

Ram Lakshman
Ram-Lakshman : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ఈ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు పంచ కట్టుకొని సంప్రదాయంగా వచ్చారు. రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ”మా లైఫ్ మొదలైందే అన్నయ్య సినిమాలు చూడటంతోనే. ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు. ఈ సినిమాలో ధర్మం శరణం గచ్ఛామి అని ఉంటుంది. ధర్మం పాటించుకుంటూ వెళ్ళాలి అని ఈ సినిమా చెప్తుంది. సనాతన ధర్మం, నాటు వైద్యం, సత్యాన్ని గురించి కూడా ఈ సినిమాలో చూపించారు. ధర్మాన్ని చెప్పగలిగే అన్నయ్యతోనే చెప్పించారు. రామ్ చరణ్ గారు ఒక డిఫరెంట్ పాత్ర పోషించారు. ఒక గొప్ప ఫిలాసఫీ చూసినట్టు ఉంటుంది. మాకు అవకాశం ఇచ్చిన కొరటాల శివకి ధన్యవాదాలు. ఒక టెక్నీషియన్ ని చూసి ఇంకో టెక్నీషియన్ అసూయ పడేలా ప్రాణాలు పెట్టి చేసాం ఈ సినిమా కోసం. చరణ్ బాబుకి, అన్నయ్యకి అదిరిపోయేలా ఫైట్స్ వచ్చాయంటే కారణం మా టీం వర్క్. మా టీం అందరికి థ్యాంక్స్. కొరటాల శివ సినిమాలన్నీ నచ్చుతాయి. ధర్మం మీద ఈ సినిమా తీశాడు. ఈ సినిమాలో ఫైట్స్ చేసేటప్పుడు మేమిద్దరం సరిపోలేదు. చిరంజీవి గారు 66 కాదు 16” అని అన్నారు. ఆ తర్వాత భలే భలే బంజారా సాంగ్ కి డ్యాన్స్ వేసి అలరించారు.
Ramajogayya Shastri : రామ్ చరణ్ కెరీర్ నా పాటతోనే మొదలైంది
ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.