Ram Charan : రామ్‌చరణ్ నన్ను కొట్టి.. తరువాత సారీ చెప్పారు.. యాక్టర్ సూర్య కామెంట్స్

రామ్‌చరణ్ తనని కొట్టి సారీ చెప్పారంటూ 'రామ్' మూవీ హీరో సూర్య రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

Ram Charan : రామ్‌చరణ్ నన్ను కొట్టి.. తరువాత సారీ చెప్పారు.. యాక్టర్ సూర్య కామెంట్స్

Ram Movie Hero Surya Ayyalasomayajula comments about Ram Charan gone viral

Updated On : January 24, 2024 / 4:23 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన సినిమాలతో ఎంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారో, తన వ్యక్తిత్వంతో కూడా అంటే అభిమానాన్ని సంపాదించుకున్నారు. స్టార్ హీరో అనే గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో ఎంతో గౌరవంగా మాట్లాడతారు. ఆయనతో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్.. రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. తాజాగా చరణ్ గురించి యాక్టర్ సూర్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీలో హీరోగా నటిస్తున్న ‘సూర్య’.. గేమ్ ఛేంజర్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. కాలేజీ టైంలో రామ్ చరణ్ ఆపోజిట్ గ్యాంగ్ లో నవీన్ చంద్ర ఫ్రెండ్ గా సూర్య నటిస్తున్నారు. ఇక సినిమాలో రామ్ చరణ్ అండ్ సూర్య మధ్య ఓ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశంలో సూర్యని రామ్ చరణ్ కాలితో తన్నితే సూర్య బౌన్స్ అయ్యి ఎగిరి పడాలంటా. అయితే సూర్య వల్ల ఆ సీన్ చేయడానికి చాలా టేక్స్ పడ్డాయట.

Also read : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ కోసం సౌండ్ డిజైనర్స్ కావాలంటా.. ఇంటి దగ్గర నుంచే వర్క్..

ఆ సీన్ చిత్రీకరించడం కోసం దాదాపు పది టేక్స్ పైగా పట్టిందట. ఇక ప్రతి టేక్ సమయంలో రామ్ చరణ్, సూర్యని కాలితో తన్నడం, షాట్ పూర్తి అవ్వగానే సూర్యని పైకి లేపి, దుమ్ము దులిపి సారీ చెబుతూనే ఉన్నారంట రామ్ చరణ్. అలాగే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అని, తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రిని మించిన తనయుడు అంటూ సూర్య చెప్పుకొచ్చారు.

ఇక రామ్ మూవీ దర్శకుడు మిహిరామ్ వైనతేయ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. “ఒక దర్శకుడిగా చెప్పాలంటే, ఆయన ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలరు. ఏ కథకి అయినా రామ్ చరణ్ గారు సెట్ అయ్యేలా మౌల్డ్ అయ్యిపోతారు” అంటూ పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. “చిరంజీవి గారి లెగసీని ముందుకు తీసుకు వెళ్లే సరైన వారసుడు” అంటూ చెప్పుకొచ్చారు.