Skanda Trailer : స్కంద ట్రైలర్.. అదరగొట్టిన రామ్.. మాస్ ఆడియన్స్‌కి పుల్ మీల్స్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న చిత్రం స్కంద. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

Skanda Trailer
Skanda : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న చిత్రం స్కంద. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తుండగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ (Thaman) సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది.
Chiranjeevi : అల్లు అర్జున్‌కు స్వీట్ తినిపించి అభినందించిన చిరంజీవి
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు (ఆగస్టు 26 శనివారం) హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా స్కంద ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో రామ్‌ను మరో లెవల్‌లో చూపించాడు బోయపాటి. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్, రామ్ డైలాగ్‌లు విజిల్స్ వేయించేలా ఉన్నాయి.