Skanda Songs : ‘స్కంద’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రామ్, శ్రీలీల డ్యాన్స్‌లో ఇద్దరికీ ఇద్దరే..
స్కంద సినిమా నుంచి మొదటి పాటని నేడు విడుదల చేశారు. నీ చుట్టూ చుట్టూ తిరిగెనే.. అంటూ ఈ పాటు సాగింది. మాస్ బీట్ తో థమన్ అదరగొట్టాడు. ఇక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా రామ్, శ్రీలీల డ్యాన్స్ బిట్స్ కూడా చూపించారు.

Ram Pothineni Sreeleela Boyapati Skanda Movie first lyrical song Released
Skanda Movie Songs : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) కాంబినేషన్లో ‘స్కంద’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ వైరల్ అయి మాస్ ఆడియన్స్ కి దగ్గరైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న స్కంద సినిమాని 15 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు.
ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మోదలుపెట్టారు. ఈ సినిమా నుంచి మొదటి పాటని నేడు విడుదల చేశారు. నీ చుట్టూ చుట్టూ తిరిగెనే.. అంటూ ఈ పాటు సాగింది. మాస్ బీట్ తో థమన్ అదరగొట్టాడు. ఇక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా రామ్, శ్రీలీల డ్యాన్స్ బిట్స్ కూడా చూపించారు. రామ్ ఎనర్జీ డ్యాన్స్ గురించి అందరికి తెలిసిందే. ఇక శ్రీలీల ధమాకాలో తన అదిరిపోయే డ్యాన్స్ చూపించి ఫ్యాన్స్ ని పెంచుకుంది. ఇలాంటి సూపర్ డ్యాన్సర్లు ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తే ఇంకెలా ఉంటుందో మనమే ఆలోచించుకోవచ్చు.
ఈ పాటలో రామ్, శ్రీలీల తమ సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టినట్టు తెలుస్తుంది. ఇక సినిమాలోని మిగిలిన సాంగ్స్ లో ఏ రేంజ్ లో డ్యాన్స్ తో అదరగొట్టారో చూడాలి. శ్రీలీల డ్యాన్స్ కోసం అయినా సినిమాకు వెళ్ళాలి అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఇక రామ్, బోయపాటి ఇద్దరూ మాస్ కలిస్తే సినిమా ఏ రేంజ్ మాస్ ఎంటర్టైనర్ లా ఉంటుందో చూడాలి.